అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సినిమా రాక చాలా కాలం అయ్యింది. ది ఘోస్ట్(The Ghost) తర్వాత నాగార్జున మరో సినిమా ఏదీ ప్రకటించలేదు. అందుకు కారణం హిట్ కొట్టాలన్న తాపత్రయం. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మలయాళంలో విజయవంతమైన పొరింజు మరియం జోస్(Porinju Mariam Jose) అనే సినిమాను తెలుగులో రీమెక్ చేయాలనుకున్నారు నాగార్జున.

nagarjuna
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సినిమా రాక చాలా కాలం అయ్యింది. ది ఘోస్ట్(The Ghost) తర్వాత నాగార్జున మరో సినిమా ఏదీ ప్రకటించలేదు. అందుకు కారణం హిట్ కొట్టాలన్న తాపత్రయం. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మలయాళంలో విజయవంతమైన పొరింజు మరియం జోస్(Porinju Mariam Jose) అనే సినిమాను తెలుగులో రీమెక్ చేయాలనుకున్నారు నాగార్జున. ఇందులో జోజు జార్జ్(Joju George) పోషించిన పాత్రను నాగార్జున వేయాలనుకున్నాడు. చాలా రోజుల కిందట ఇది అనుకున్నా ఎందుకో ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ సినిమాతో రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకుడిగా మారనున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీకి అప్పగించారు నాగార్జున. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఆల్‌మెస్టాల్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. విజయ్ బిన్నీకి ప్రసన్నకుమార్ రచనా సహకారం అందిస్తున్నారని తెలిసింది. వచ్చే నెలలో షూటింగ్ మొదలు కానున్నదని తెలిసింది.
