సమంత(Samantha)కు విడాకులు ఇచ్చి.. శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)తో డేటింగ్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ఇది రూమర్ గానే ఉన్నా..వారిద్దరు కెమెరాల కంటికి చిక్కడంతో.. ఆడియన్స్ అంతా. ప్పటికే ఫిక్స్ అయిపోయారు. రీసెంట్ గా వీరిద్దరు బయట డేట్ లో ఉన్నప్పటి ఫోటోలు తెగ చెక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో

సమంత(Samantha)కు విడాకులు ఇచ్చి.. శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)తో డేటింగ్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ఇది రూమర్ గానే ఉన్నా..వారిద్దరు కెమెరాల కంటికి చిక్కడంతో.. ఆడియన్స్ అంతా. ప్పటికే ఫిక్స్ అయిపోయారు. రీసెంట్ గా వీరిద్దరు బయట డేట్ లో ఉన్నప్పటి ఫోటోలు తెగ చెక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యిపోయింది. అంతే కాదు వీరి పెళ్లికి ఇటు నాగార్జునతో పాటు... అటు శోభిత ఫ్యామిలీ కూడా ఒకే చెప్పిందంటూ.. వార్తలు గుప్పుమన్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య(Naga Chaitanya) కష్టడీ (Custody) మూవీ బిజీలో ఉన్నాడు. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గోంటున్నాడు. రీలీజ్ డేట్ దగ్గరలో ఉండటంతో.. ఈసినిమా ట్రైలర్ కూడా వదిలారు. మూవీపై అక్కినేని ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అఖిల్ ఏజంట్ తో నిరాశపరచడంతో.. నాగచైతన్య అయినా కష్టడీతో ఊరటనిస్తాడని చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న చైతన్య.. తాజాగా తన క్రష్(crush) ఎవరు అన్నది బయట పెట్టేశాడు.

నాగచైతన్య మాట్లాడుతూ.. నాక్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు.. దాచే అవసరం కూడా లేదు.. హాలీవుడ్ యాక్ట్రెస్ మార్గట్‌ రోబీ (Margot Robbie)పై నాకు చాలా క్రష్ ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన బేబీలాన్ (Babylon)సినిమా చూశాను. ఆమూవీలో ఆమె యాక్టింగ్ కు నేను ఫిదా అయ్యిపోయాను. అందుకే ఆమె నటనపై నాకు బాగాక్రష్ వచ్చేసిందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈవ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మరో ఇంటర్వ్యూలో తన జీవితంలో పశ్చాత్తాపడ్డ(regret) సంఘటన గురించి కూడా షేర్ చేసుకున్నాడు. నాగచైతన్య. పర్సనల్ లైఫ్ లో తాను ఎప్పుడూ పెద్దగా పశ్చాత్తాపపడలేదన్నారు చైతూ.. సమంత విషయం ఏమైనా చెపుతారేమో అనిఎదురు చూసిన ఆడియన్స్ కు ఈ విషయంలో నిరాశే ఎదురయ్యింది. కాని ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం మూడు సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోయానని పశ్చాత్తాప పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కస్టడీ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కింది. కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Updated On 2 May 2023 11:46 PM GMT
rj sanju

rj sanju

Next Story