మే 11న విడుదల కాబోతూన్న కస్టడీ(custody) చిత్రానికి శివ అని టైటిల్ పెడదామని ముందు కొంత చర్చ జరిగిందట. దర్శకుడు వెంకట ప్రభు(venkat prabhu) మనసులో ఎప్పటి నుంచో నానుతున్న శివ టైటిల్ గురించి కస్టడీ హీరో నాగచైతన్యతో(Nagachaithanya) చాలా సార్లు ప్రస్తావించాడుట కూడా ప్రభు. కానీ నాగ చైతన్య మాత్రం ససేమిరా అంటే ససేమిరా అని చప్పాడు.
మే 11న విడుదల కాబోతూన్న కస్టడీ(custody) చిత్రానికి శివ అని టైటిల్ పెడదామని ముందు కొంత చర్చ జరిగిందట. దర్శకుడు వెంకట ప్రభు(venkat prabhu) మనసులో ఎప్పటి నుంచో నానుతున్న శివ టైటిల్ గురించి కస్టడీ హీరో నాగచైతన్యతో(Nagachaithanya) చాలా సార్లు ప్రస్తావించాడుట కూడా ప్రభు. కానీ నాగ చైతన్య మాత్రం ససేమిరా అంటే ససేమిరా అని చప్పాడు. కానీ, కస్టడీ చిత్రానికి అక్షరాల శివ టైటిల్ ఎంతో యాప్ట్ అనిపించినా కూడా చివరి నిమిషంలో నాగచైతన్య మత్రం సుతరామూ అంగీకరించలేదు.
దీనికి గురించ నాగచైతన్య వివరిస్తూ’’ నాకూ శివ టైటిల్ బాగుంటుందని అనిపించినా సరే నాకు మాత్రం గట్స్ సరిపోలేదు. మా ప్రభు చాలా మనసు పడ్డాడు శివ టైటిల్ మీద. అతని ఆవేశాన్ని చల్లార్చి చెప్పాను. శివ అన్నది ఓ కల్ట్ ఫిల్మ్. దానికో చరిత్ర ఉంది. శివ(shiva) రికార్డు ఎన్నో రకాలుగా చాలా చాలా గొప్పది. అటువంటి చిత్రం టైటిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ టచ్ చేయనే చేయకూడదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాను. సినిమా రిజల్టు మాట అటుంచి, ముందు ఆ టైటిల్ పెట్టామని తెలిస్తేనే అందరూ తన్నడానికి బయల్దేరతారు. కొన్ని చిత్రాల జోలికి వెళ్ళకపోతేనే మంచిది. వాటి దగ్గరగా కూడా వెళ్ళేలేం.’’ అని నాగూ భాయ్ నొక్కి వక్కాణించాడు.
కస్టడీ చిత్రంలో ప్రత్యేకతను గురించి చెబుతూ ‘’సాధారణంగా ఏ సినిమాలోనైనా విలన్ చంపడమో, పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడమో హీరో బాధ్యత. కానీ కస్టడీలో మాత్రం దానికి డిఫరెంట్‌గా విలన్ చనిపోకుండా ప్రొటెక్షన్‌గా హీరోయే నిలబడతాడు. ఇదెలా అని అడగొద్దు. అది సినిమాలో చూడండి’’ అని ఓ చిన్న సస్పెన్స్ క్రియేట్ చేశాడు మన నాగచైతన్య.
తమిళ తెలుగు భాషలలో తెరకెక్కుతున్న కస్టడీ సినిమా పెరఫెక్టుగా తయారైందని, తెలుగులో డైరెక్ట్ చిత్రం మొదటిసారి చేస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, సినిమా హిట్ అవడానికి యూనిట్ అంతా చాలా కష్టపడ్డారని దర్శకుడు ప్రభు అంటున్నాడు. కస్టడీ చిత్రం హిట్ అయితే మళ్ళీ అన్నపూర్ణా స్టూడియోస్‌కీ, నాగార్జున ఇమేజ్‌కీ కొంత ఊరట లభించనట్టవుతుంది