నాగచైతన్య(Naga chaithanya).. ఈసారి సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాలో ఆయన జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ఆయన చాలా వరకూ వర్క్ చేశాడు.

నాగచైతన్య(Naga chaithanya).. ఈసారి సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాలో ఆయన జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ఆయన చాలా వరకూ వర్క్ చేశాడు. వారి లైఫ్ స్టైల్ ను.. ఫీల్డ్ లోకి వెళ్లి మరీ.. వారి బాడీ లాంగ్వేజ్(Body language) ను నేర్చుకున్నాడు. ఇక ఇఫ్పుడు ఫిట్ నెస్(Fitness) మీద దృష్టి పెట్టాడట యువసాంమ్రాట్.

పాత్రకు తగ్గట్టు గెటప్‌ మార్చుకుంటే సరిపోవట్లేదు ఇప్పుడు.. అందుకు తగ్గట్టు.. బాడీని.. బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకోవల్సి వస్తోంది. ఆ విషయంలో మన హీరోలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు సినిమా కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా వెనకాడటంలేదు. హీరోలు అందరూ దాదాపు అందుకు తగ్గట్టు శరీరాన్ని కూడా మార్చుకొంటున్నారు. అవసరమైతే అనూహ్యంగా బరువు పెరగాలి. మళ్లీ అనూహ్యంగా బరువు తగ్గాలి. ఈ మ్యాజిక్‌ అంతా నెలల్లోనే జరిగిపోవాలి. దీనికోసం హీరోలు పడే పాట్లు మామూలుగా ఉండవు. రోజులో ఎక్కువ సమయం జిమ్‌లోనే

ఇలా చేస్తున్నారు కాబట్టే మన హీరోలకు అంత స్టార్ డమ్.. అంత రెమ్యూనరేషన్ ఇవన్నీ ఊరికే రావు కదా..? తాజాగా నాగచైతన్య కూడా అదే పనిలో ఉన్నాడు. చందు మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో మొదలుకానుంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా చందు మొండేటి ఈ కథ తయారు చేసుకున్నాడు. ఇందులో నాగచైతన్యది జాలరి(Firsher man) పాత్ర. అందుకే ఆ పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలచుకునే పనిలో ఉన్నాడు నాగచైతన్య.

ఫిట్నెస్‌ కోసం జిమ్‌లో తను గట్టిగా కష్టపడుతూ ఓ వీడియోను ఎక్స్‌(twitter)లో పొందుపరిచాడు. ఈ వీడియోలో చైతూ నిజంగానే చాలా ధృఢంగా కనిపిస్తున్నాడు. పాత్రకోసం తను బాగా మారిపోయాడని ఈ వీడియో చూసినవారంతా చర్చించుకుంటున్నారు. గీతా ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Updated On 6 Nov 2023 8:24 AM GMT
Ehatv

Ehatv

Next Story