ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి.. స్టార్ హీరోగా తనను తాను నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Akkineni Nagachaithanya). ఇప్పటి వరకూ కరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన నవయువ సామ్రాట్.. బ్లాక్ బస్టర్లు కొట్టింది లేదు.

ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి.. స్టార్ హీరోగా తనను తాను నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Akkineni Nagachaithanya). ఇప్పటి వరకూ కరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన నవయువ సామ్రాట్.. బ్లాక్ బస్టర్లు కొట్టింది లేదు. కాని ఆయన కెరీర్ లో దారుణ పరాజయాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఇక తాజాగా తన నెక్ట్స్ సినిమా కోసం బిజీ అయ్యాడు చైతూ. ఈసారి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ చిత్రానికి చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించనున్నారు.

ఇక గీతా ఆర్ట్స్‌(Geetha Arts) బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల(Fishermen) కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈమూవీ NC23 వర్కింట్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోబోతున్నారు. మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస, భాష స్వయంగా తెలుసుకొనేందుకు ఆ గ్రామానికి వెళ్ళారు చైతు. ఈ చిత్రంలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. చైతన్య లుక్ ప్రస్తుతం కాస్త డిఫరెంట్ గానే ఉంది.

మత్స్యకారుల పాత్ర. ఇక ఈసినిమాలో మొదట హీరో ఎలా ఉన్నా.. పాకిస్థానీలకు చిక్కిన తరువాత చిక్కి శల్యమైపోవాలసిందే. అదే పాత్రకోసం..రియాల్టీకి దగ్గరగా ఉంటుందని బరువు తగ్గబోతున్నారట చైతూ. చాలా వరకూ వెయిట్ లాస్ అయ్యి.. సరికొత్త నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. నాగచైతన్య ఆక్యారెక్టర్ కోసం బరువు కూడా తగ్గుతున్నారట. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ చైతన్య కూడా యాక్టివ్ గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని ఆయన గతంలో సందర్శించిన సంగతి తెలిసిందే.

Updated On 28 Oct 2023 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story