రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో(deep fake Video) చాలామందిని కదిలించింది. దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. బ్రిటిష్ ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్(Jara Patel) వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్(Morphing) చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్‌లోడ్ అయిన నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఫేక్ వీడియోపై ఇప్పటికే చాలా మంది రియాక్టయ్యారు.
రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో(deep fake Video) చాలామందిని కదిలించింది. దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. బ్రిటిష్ ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్(Jara Patel) వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్(Morphing) చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్‌లోడ్ అయిన నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఫేక్ వీడియోపై ఇప్పటికే చాలా మంది రియాక్టయ్యారు. నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha), గాయని చిన్మయి శ్రీపాద(chinmai Sripada), హీరో నాగ చైతన్యలు(Naga chaithanya) రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి నీచమైన పని చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajiv chnadra shekar) కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివారిపై చర్యలు తప్పవన హెచ్చరించారు. ఈ దుశ్చర్యపై నాగ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం బాధగా ఉందని చెప్పారు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని అన్నారు. బాధితుల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. ఇక తనకు మద్దతుగా నిలిచిన నాగచైతన్యకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల వల్ల సమాజంలో ఎందరో అమ్మాయిలు ఇబ్బందులకు గురవుతున్నారని రష్మిక అన్నారు