కెరీర్ బిగినింగ్ నుంచి ఎంత ప్రయత్నించినా.. హిట్ కొట్టలేకపోయాడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) . స్టార్ హీరోగా మారలేకపోతున్నాడు. అసలు హిట్ సినిమా అంటూ లేదు అతని కెరీర్ లో. కాని ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్.

కెరీర్ బిగినింగ్ నుంచి ఎంత ప్రయత్నించినా.. హిట్ కొట్టలేకపోయాడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) . స్టార్ హీరోగా మారలేకపోతున్నాడు. అసలు హిట్ సినిమా అంటూ లేదు అతని కెరీర్ లో. కాని ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. నాగార్జున(Nagarjuna) వారసుడిగా అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పటివరకు సుమారు ఐదు సినిమాలలో నటించాడు.. కాని ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోయిజం వరకూ అన్నీ ట్రై చేశాడు. కాని పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఒక స్టార్ హీరో కుమారుడిగా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఇప్పటివరకు సరైన హిట్ పడకపోవడం అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. అఖిల్ కెరియర్ పరంగా నాగార్జున తనకు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు.

అయితే ఇండస్ట్రీలో నిలబడటం కోసం అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈమధ్య వచ్చిన ఏజెంట్(Agent) కోసం దాదాపు రెండేళ్లు .. సిక్స్ ప్యాక్ ను అలానే మేయింటేన్ చేశాడు. బాడీ బిల్డింగ్ చేసి.. అందరూ ఆశ్చర్యపోయేలా తయారయ్యాడు. కాని ఈసినిమా ప్లాప్ తో అదంతా వృదా అయ్యింది. సక్సెస్ అవడం కోసం అఖిల్ కూడా ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. తదుపరి సినిమాల కోసం కూడా అఖిల్ భారీ స్థాయిలోనే కసరత్తులు చేస్తున్నారు.

ఈక్రమంలో అఖిల్ తన అందాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవాలి అనుకుంటున్నాడట. ఇప్పటికే కొంత మంది హీరోలు, హీరోయిన్లు తమ అందానికి మెరుగులు దిద్దుకుంటూ.. బాడీలో తమకు మైనస్ అనిపించిన వాటికి సర్జరీలు(Surgery) చేయించుకుంన్నారు. అలా కాస్త ఛేంజ్ అయిన మిగతా స్టార్స్ ను ఆదర్శంగా తీసుకుని.. వారి బాటలోనే అఖిల్ కూడా ఓ సర్జరీకి రెడీ అవుతున్నాడట. చూడటానికి హీరో కటౌట్ అయినప్పటికీ ఈయన ముక్కు కారణంగా ఆయన ఫేసులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ(Nose Surgery) చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.

Updated On 17 Oct 2023 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story