ఏజెంట్(agent) సినిమా బాక్సాఫీసు దగ్గర పూర్తిగా బొక్కబోర్లా పడిన తర్వాత అఖిల్‌ అక్కినేని నెక్స్ట్‌ అపడేట్ పెద్దగా ఎవరినీ ఉత్సాహపరచదు. ఎంతో హంగామా...ఎంతో సందడి చేశారు ఏజెంట్‌ యూనిట్‌ రిలీజ్‌కి ముందు. అసలు ఇలాటి సినిమా మళ్ళీ రాదు అని, బల్ల ఇక్కడ లేదు గుద్ది చెప్పడానికి అని నిర్మాత అనిల్‌ సుంకర చెప్పడంతో ఏజెంట్‌కి తిరుగులేని ఊపొచ్చింది

ఏజెంట్(agent) సినిమా బాక్సాఫీసు దగ్గర పూర్తిగా బొక్కబోర్లా పడిన తర్వాత అఖిల్‌ అక్కినేని నెక్స్ట్‌ అపడేట్ పెద్దగా ఎవరినీ ఉత్సాహపరచదు. ఎంతో హంగామా...ఎంతో సందడి చేశారు ఏజెంట్‌ యూనిట్‌ రిలీజ్‌కి ముందు. అసలు ఇలాటి సినిమా మళ్ళీ రాదు అని, బల్ల ఇక్కడ లేదు గుద్ది చెప్పడానికి అని నిర్మాత అనిల్‌ సుంకర చెప్పడంతో ఏజెంట్‌కి తిరుగులేని ఊపొచ్చింది. ఇంక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడిన తీరు అందరి మతి పోగొట్టింది. అయ్యబాబోయ్‌....ఏజెంట్‌ అంత గొప్ప సినిమానా అని ఏజెంట్‌ రిలీజ్‌ డేట్‌ కోసం వెర్రెక్కిపోయారు. కానీ తీరా చూస్తే మోర్నింగ్‌ షో తర్వాత పబ్లిక్‌ టాక్‌ చూస్తే మరోసారి మతిపోయింది.

వంశపారంపర్యంగా వస్తున్న అక్కినేని అభిమానులు తల పటుకుంటున్నారు ప్రపంచంలో ఎన్ని రకాల గన్స్ ఉంటాయో, ఉన్నాయో వాటి ఎగ్జిబిషన్‌లా ఉందని, మీ ఇంట్లో ఏసి పోతే గనక 350 రూపాయలు పెట్టి టిక్కెట్టు కొనుక్కుని ధియేటర్‌లో కూర్చుంటే ఓకే..బట్‌ సినిమాగా అయితే మాత్రం వద్దు వద్దు అని మైకులు ముందు అందరూ వీరంగం తొక్కారు. ఈ మద్యరోజుల్లో ఏ హీరోకి ఇటువంటి దారుణమైన రెస్పాన్స్‌ రాలేదు. దీనంతటికీ సంజాయిషీ చెబుతూ, చిత్రనిర్మాత అనిల్‌ సుంకర్‌(anil sunkara) చాలా నిజాయితీగా అసలు స్క్రిప్ట్‌ కూడా లేకుండా జరిగిందని వాపోతూ ట్వీట్‌ చేయడం ఇందులో కొసమెరుపు.

ఇటువంటి టైంలో అఖిల్‌ అక్కినేని నెక్స్ట్ సినిమా అంటే ఎవ్వరికీ బొత్తిగా ఇంట్రస్టే లేకుండా పోయింది. పోగా, ఎన్నిసార్లు లాంచ్‌ చేస్తారనే వివాదం లాటి టాక్‌ కూడా నడిచింది. యూవీ క్రియేషన్స్ లాటి క్రేజీ బ్యానర్‌ చేస్తున్నా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎవ్వడూ ఆసక్తి చూపట్లేదు. యూవీ క్రియేషన్స్(UV creations) అధినేతలకు ఫోన్లు చేసి మరీ, ప్రాజెక్ట్‌ డ్రాప్‌ చేసుకుంటే బెటర్‌ అని కొందరు హితులు శ్రేయోభిలాషులు చెబుతున్నారని ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతోంది ఇండస్ట్రీలో.ఈ టైంలో ఈ సినిమాకి ఓ వార్త చిన్నటి, సన్నటి ఊపిరి పోసింది.

యూవీ క్రియేషన్స్ సాహో చిత్రానికి స్కిప్ట్ వర్క్ చేసిన అనిల్‌ కుమార్‌(anil kummar) అనే యంగ్‌ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తూ అఖిల్‌తో చేస్తున్న్ ఈ సినిమాలో అఖిల్‌ కాంబోలో శ్రీదేవి డాటర్‌ జాహ్నవి కపూర్‌janhvi kapoor) చేయబోతున్న వార్త బైటకొచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి కాస్త గ్లామర్‌ వచ్చింది. కానీ, అదేదో జాహ్నవీ చేసినంత మాత్రాన అదేదో సూపర్‌ హీరో సినిమా అయిపోతుందని కాదిక్కడ. ఎవరు ఏం చేసినా, కథ సరింగా లేకపోతే సినిమా పని నాగార్జున టైటిల్‌ గోవిందా...గోవిందాయే. కాకపోతే శ్రీదేవి డాటర్‌ జాహ్నవీ తెలుగులోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతోంది కాబట్టి చిన్ని అట్రాక్షన్‌! జాహ్నవీకి ఇది తెలుగులో రెండో సినిమా అవుతుంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న NTR 30 జాహ్నవికి ఫస్ట్‌ స్టెప్‌ తెలుగులోకి. పోనీ జాహ్నవీతోనైనా అఖిల్‌కొ ఓ హిట్‌ వస్తే ఉంది కథ.

Updated On 3 May 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story