ఈసారి ఏజంట్ సినిమా రిజల్ట్ ను బట్టే అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది. అందుకే ఈసారి ఈసినిమా కోసం సాలిడ్ గా కష్టపడుతున్నాడు. సినిమా ప్రమోషన్ కోసం కూడా సాహసాలు చేస్తున్నాడు.

ఈసారి ఏజంట్ సినిమా రిజల్ట్ ను బట్టే అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది. అందుకే ఈసారి ఈసినిమా కోసం సాలిడ్ గా కష్టపడుతున్నాడు. సినిమా ప్రమోషన్ కోసం కూడా సాహసాలు చేస్తున్నాడు.

అఖిల్ (Akkineni Akhil)హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent). అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ద్వారా సాక్షీ వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన ఈసినిమా.. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. షూటింగ్ ముగించుకుని.. మరోసారి కొన్ని రీషూట్లు చేసుకుని.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నెల 28 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఏజంట్ సినిమా.

అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent) సినిమా కోసం గత రెండేళ్లుగా కష్టపడ్డాడు. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా..ప్లే బాయ్ గా కనిపించిన అఖిల్.. కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. సిక్స్ ప్యాక్ తో పాటు బీస్ట్ లుక్ లో.. భారీ స్థాయిలో. ఓ హల్క్ లా సాలిడ్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) తప్ప మిగిలిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఈసినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

ఆశలన్నీ ఈసినిమాపైనే పెట్టుకున్నాడు అఖిల్. అందుకే ఏజంట్ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలి అని..ప్రమోష్ల జోరు పెంచాడు. అందరికంటే డిఫరెంట్ గా ప్రమోషన్స్ను ప్లాన్ చేస్తున్నాడు అఖిల్(Akkineni Akhil). దాని కోసం సాహసాలు కూడా చేస్తున్నాడు. ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు ఏజంట్ టీమ్.. . తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ చేశారు. విజయవాడలో PVP మాల్ వద్ద ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించగా ఇక్కడ అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు అక్కి అక్కినేని.

PVP మాల్ బిల్డింగ్ పైనుంచి అఖిల్ దూకగా కింద అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అఖిల్(Akkineni Akhil) కిందకు దిగుతుంటే అఖిల్ పై పూల వర్షం, పేపర్స్ కురిపించారు. విజయవాడ ఫ్యాన్స్ అఖిల్ కి గ్రాండ్ గా స్వాగతం పలికారు. అఖిల్ పై నుంచి ఇలా తాళ్ల సాయంతో దూకిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారగా ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ లో స్టంట్స్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు అయితే ప్రమోషన్స్ కోసం అఖిల్ డేర్ చేస్తున్నాడు, ఎవ్వరూ చేయని విధంగా చేస్తున్నాడు, సరికొత్తగా ట్రై చేస్తున్నాడు అంటూ అభినందిస్తున్నారు.

Updated On 17 April 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story