కెరీర్‌ ప్రారంభం నుంచి సరైన హిట్‌ లేక అఖిల్‌ అక్కినేని(akhil akkineni) అభిమానులు ప్రతీక్షణం ఆవేదన చెందుతూనే ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావుగారి(akkineni nageshwar rao) అభిమానులు నాగార్జున(Nagarjuna) అభిమానులుగా మారినా మొదట్లో, తర్వాత రోజులలో

కెరీర్‌ ప్రారంభం నుంచి సరైన హిట్‌ లేక అఖిల్‌ అక్కినేని(akhil akkineni) అభిమానులు ప్రతీక్షణం ఆవేదన చెందుతూనే ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావుగారి(akkineni nageshwar rao) అభిమానులు నాగార్జున(Nagarjuna) అభిమానులుగా మారినా మొదట్లో, తర్వాత రోజులలో నాగార్జున తనదైన ప్రత్యేకమైన స్టయిల్‌తో ఒక విభిన్నమైన ట్రెండ్‌ను సృష్టించకుని స్టార్‌డమ్‌లోకి దూసుకుపోయారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైబడిన కెరీర్‌లో నాగార్జున అద్భుతమైన చిత్రాలను చేయడం, సంచలనాలను సృష్టించడంతో అన్పపూర్ణ సర్క్యూట్‌ ఎప్పుడూ కళకళలాడుతూ వెలిగింది. తర్వాత వచ్చిన నాగచైతన్య కూడా కొన్ని మంచి హిట్స్‌తో బాగానే రాణించాడు.

అఖిల్‌ కెరీరే ఎప్పుడూ సందిగ్ధావస్థలోనే ఉంటూ, ఎటు వైపుకు వెళ్తోందో కూడా తెలియని దిశగా ప్రయాణించడం అక్కినేని అభిమానులు జీర్ఝించుకోలేకపోతున్నారు. మొదటి సినిమా అఖిల్‌కి సుప్రసిద్ధ దర్శకుడు వివి వినాయక్‌ ఎంత గొప్పగా తీద్దామనుకున్నా కూడా ఖర్చు అయితే 40 కోట్లయింది గానీ, హిట్‌ అన్న రెండు మాటలను దక్కించుకోలేకపోయింది అఖిల్‌. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొదలైంది అఖిల్‌ కెరీర్‌. తర్వాత వచ్చిన హలో, మజ్ఞూ చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోవడమే కాదు, అఖిల్‌ కెరీర్‌ని ప్రశ్నార్ధకం చేసేశాయి. ఒకటి, రెండు, మూడు ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు కౌంట్‌ అవుతుంటే కొత్త హీరోల పరిస్థితి దీనాతిదీనంగా మారిపోతుంది. అదే అయింది అఖిల్‌కి. తర్వాత విడుదలైన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచులర్‌ చిత్రం కొంతవరకూ అఖిల్‌కి డిపాజిట్లు దక్కించి, బొటాబొటి మార్కులతో హిట్‌ అని ఎట్టకేలకు అనిపించుకోగలిగింది. అది కూడా అందులో హీరోయిన్‌ పూజాహెగ్డే అక్కౌంట్‌లో వేసేశారు సినీ పండితులు. మళ్ళీ అదో ఆశనిపాతం. ఇలాటి పరిస్థితులలో అఖిల్‌ ఏజెంట్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మరో భారీ చిత్రాల దర్శకుడు. సురేందర్‌ రెడ్డి.

ఒక టైంలో సుమంత్‌ కెరీర్‌ కూడా ఇలాగే అవాంతరాల పాలయింది. మొదటి చిత్రం ప్రేమకథకి రాంగోపాల్‌ వర్మ డైరెక్షన్. తన పైత్యం అంతా దట్టించి సినిమా తీసి, సుమంత్‌ ఏ పిసరూ అంటకుండా పాడు చేశాడు వర్మ. తర్వాత నాగార్జున కాంబినేషన్‌లో ఒక సినిమా, నాగార్జున-అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌లో మరో సినిమా....ఏవీ కూడా సుమంత్‌కి కలసి రాకపోగా, సుమంత్‌ని ముంచాయి. ఓ యువకథానాయకుడిగా సుమంత్‌ తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఎక్కడా అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. చివరికి సూర్యకిరణ్ అనే కొత్త దర్శకుడు సుమంత్ పంట పండించాడు. అదే సత్యం. ఆరోజుల్లోనే 15 కోట్ల వరకూ కలెక్ట్‌ చేసి సుమంత్‌ని ఎత్తుకి ఎత్తింది.

ఇప్పడు అఖిల్‌ చేసిని ఏజెంట్‌ సినిమా చూస్తే...అఖిల్‌ చేసిన హోంవర్క్, డెడికేషన్‌, కృషీ అన్నీ చాలా క్లియర్‌గా తెరమీద కనిపిస్తాయి. అఖిల్‌ కూడా సూపర్‌గా కనిపించాడు. చేశాడు. కానీ, సినిమా అంతా రకరకాల పాత్రలతో, కథ ఎటో వెళిపోతూ ఉంటుంది. మళ్ళీ అఖిల్‌ బాధ్యతలాగే ఉంటుంది కథనం. రెండింటికీ పొంతన లేకపోవడం సినిమాకి పెద్ద ఇబ్బందిగా తయారైంది. ఇదెవరికి అఖిల్‌ చెప్పుకోగలడు? నిర్మాత అనిల్‌ సుంకర కూడా శక్తి వంచన లేకుండా డబ్బు కుమ్మరించారు. రిస్క్ అయినా కూడా గట్టిగా నిలబడిపోయి, నిర్మాత స్థానానికే గర్వాన్ని తెచ్చారు. కానీ, అక్కినేని అభిమానులు గానీ, అఖిల్‌ని అభిమానించే యువతరంగం గానీ బిగ్గరగా ఇది హిట్టూ అని చెప్పుకునే పరిస్థితి మాత్రం అఖిల్‌ అందివ్వలేదు. దాంతో అభిమానుల రోదనకి అంతే లేకుండా పోయిందని వారు ధియేటర్ల దగ్గర పబ్లిక్‌ టాక్‌ మైకుల దగ్గర వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికైన, అఖిల్‌ కొత్త ఆలోచనలతో, కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే నవతరం దర్శకులను ఆహ్వానిస్తే, అఖిల్‌కి ఈ తిప్పలు తప్పుతాయని ధియేటర్ల దగ్గర అభిమానులు అనుకుంటున్నారు.

Updated On 28 April 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story