సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ పై అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు చాలా అంచనాలు

అఖిల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అక్కినేని అభిమానులు అతను పెద్ద స్టార్‌గా ఎదగాలని ఆశించారు. టైర్ -1 టాలీవుడ్ స్టార్స్‌తో పోటీ పడతాడని కూడా అంచనా వేశారు. అఖిల్-ది పవర్ ఆఫ్ జువా సినిమాకు భారీ హైప్ వచ్చింది. మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. అప్పటి నుండి అఖిల్ సక్సెస్ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి అఖిల్ కు హిట్ దక్కింది. ఇక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని అంచనా వేసిన 'ఏజెంట్' డిజాస్టర్ గా నిలిచింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ పై అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు, ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమై అందరినీ నిరాశపరిచింది. ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ తర్వాత అఖిల్ నుంచి ఎలాంటి సినిమా ప్రకటనలు రాలేదు. అతని తదుపరి చిత్రం ఇప్పటికే UV క్రియేషన్స్‌లో ఒక డెబ్యూ డైరెక్టర్‌తో కమిట్‌ అయ్యారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఏజెంట్ విడుదలై ఒక సంవత్సరం కావస్తోంది.. అయితే అఖిల్ పుట్టినరోజున ఏప్రిల్ 8న ఒక అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే అది కూడా లేకపోవడంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.

Updated On 9 April 2024 9:03 PM GMT
Yagnik

Yagnik

Next Story