మళ్లీ కొండా సురేఖ నోటి వెంట ఆ అసహ్యపు మాటలే వచ్చాయి.
మంత్రి కొండా సురేఖ(Konda surekha) తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఇక్కడితో ఈ అంశాన్ని వదిలిపెట్టమని టీపీసీసీ చీఫ్ సినీ ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేసి గంటలు కూడా కాలేదు. మళ్లీ కొండా సురేఖ నోటి వెంట ఆ అసహ్యపు మాటలే వచ్చాయి. నాగచైతన్య(Naga chiathanya), సమంతల(samantha) విడాకులపై(Divorce) పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేయడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారేమోనన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖను వదిలిపెట్టే ప్రసక్తే లేదనంటున్నారు హీరో అఖిల్ అక్కినేని(Akhil akkineni). ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 'కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం.. ఆమె సామాజిక విలువలు, సంక్షేమాన్ని మర్చిపోయారు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది.. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు' అని అఖిల్ అక్కినేని చెప్పారు.