ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు అఖిల్(Akhil Akkineni). ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. అఖిల్ కెరీర్ డేంజర్ లో పడినట్టే.. ఇక ఏలాగైనా అఖిల్ కు హిట్ ఇవ్వాలని.... ఇండస్ట్రీలో ఉనికి చాటుకోవాలని చూస్తున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy). అందుకే అఖిల్ ఏజంట్ కు సంబంధించి సర్ ప్రైజ్ లు ప్టాన్ చేశాడు.. కొన్ని ట్విస్ట్ లతో పాటు.. హిట్ ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

Ram Charan For Agent

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent Movie). స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) రూపొందిస్తున్న ఈసినిమా ద్వారా మోడల్ సాక్షీ వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఎప్పుడూ లవర్ బాయ్ గానే కనిపించే అఖిల్.. ఈసినిమాతో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేయబోతున్నాడు. అంతే కాదు హల్క్ మాధిరి బీస్ట్ బాడీతో.. సిక్స్ పాక్ లో అదరగొట్టాడు అఖిల్. అచ్చం ఆర్నాల్డ్ లా ఉన్నావు అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా హిట్ పై అఖిల్ బోలెడు ఆశలతో ఉన్నాడు. శుక్రవారం రోజు ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీ రిలీజ్ అవుతుండటంతో.. సినిమాపై ఉత్కంట పెరుగుతుంది.
ఏజంట్ సినిమా హైప్ రెట్టింపు అయ్యేలా.. సినిమా పక్కాగా హిట్ అయ్యేలా.. ఏజెంట్ టీం షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈమూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గెస్ట్ రోల్ చేస్తుననట్టు చిన్న హింట్ వదిలింది. ఈరకంగా చేస్తే.. మెగా ఫ్యాన్స్ నుంచి కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారనుకుంటా.. అంతే కాదు.. ఈమూవీలో చరణ్ కనిపిస్తే.. ఏజంట్ పక్కా హిట్ అవుతుంది అని ప్లాన్ చేశారు టీమ్. ఏజంట్ కు.. రామ్ చరణ్ ధృవకు లింక్ కలుపుతూ.. టీజర్ రిలీజ్ చేశారు. ఏజెంట్ ని.. ధృవ మీట్ అవబోతున్నట్లు టీజర్ లో చూపించారు.
ఇక ఈ టీజర్ లో పవర్ ఫుల్ గా ధృవ బిజియం వస్తుంది. వెనుక నుంచి రాంచరణ్ ని చూపించారు. చివర్లో ఏజెంట్ ఎక్కడున్నావు అంటూ రాంచరణ్ పవర్ ఫుల్ వాయిస్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ధృవ సినిమాను కూడా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అది కూడా యాక్షన్ మూవీ కావడంతో.. ఇలా లింక్ చేసి.. సినిమా అంచనాలు పెంచేశారు టీమ్.
ఈ టీజర్ ని అఖిల్ తన సోషల్ మీడియా పేజ్ లో స్వయంగా పోస్ట్ చేశారు. ఈ టీజర్ కి ధృవ X ఏజెంట్.. పరిస్థితులు మరింత వైల్డ్ గా మారుతున్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు.దృవ మాదిరి స్పై థ్రిల్లర్ లాగే ఏజంట్ కూడా తెరకెక్కింది. ఇక ఈరెండు సినిమాలు దర్శకుడు ఏం లింకు పెట్టడాడా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు. ఈ టీజర్ లో అటు మెగా ఫ్యాన్స్ చూపు కూడా ఇటు మళ్ళేలా చేశాడు సురేందర్ రెడ్డి.
Stay tuned…. #Dhruva x #Agent. #AGENTonApril28th pic.twitter.com/QJOenBa3h2
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 26, 2023