ఏజెంట్ సినిమా(Agent Movie)తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni). ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన పట్టుదలతో ఉన్నాడు. ఏజంట్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న అఖిల్... ఫ్యామిలీ సినిమాతో పాటు.. మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అఖిల్ ఏజంట్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండటంతో.. ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు వరుసగా ఇంటర్వ్యూలతో ఇంతకు ముందుకంటే ఎక్కువగా సందడ చేస్తున్నాడు అఖిల్. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.

ఏజెంట్ సినిమా(Agent Movie)తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni). ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన పట్టుదలతో ఉన్నాడు. ఏజంట్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న అఖిల్... ఫ్యామిలీ సినిమాతో పాటు.. మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంతకీ అఖిల్ ఏజంట్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండటంతో.. ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు వరుసగా ఇంటర్వ్యూలతో ఇంతకు ముందుకంటే ఎక్కువగా సందడ చేస్తున్నాడు అఖిల్. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. అఖిల్ కు రెండు మూడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ.. సినిమా తప్పకుండా చూడాలని.. ఆడియన్స్ ను వేడుకున్నారు. ఏదో యాక్షన్ సినిమా కదా అనికుని ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవ్వద్దు.. సెంటిమెట్స్ తో కూడిన.. ఫ్యామిలీ డ్రామా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అన్నారు అఖిల్. ఇక మిడా ప్రతినిథులు.. తన ప్యామిలీ మూవీ గురించి అడగ్గా.. ఫ్యామిలీతో కలిసి నటించే విషయాన్ని గురించి స్పందిస్తూ .. మనం సినిమా లాంటి స్క్రిప్టులు తరచుగా చేయడం సాధ్యం కాదు. కావాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్ కి ఉన్న విలువ పోతుంది అని అన్నారు అఖిల్.

ఇక మల్టీ స్టారర్ సినిమాల గురించి అభిప్రాయం అడగ్గా.. మల్టీ స్టారర్ సినిమాల గురించి.. ఊహించని కామెంట్స్ చేశాడు అఖిల్. తన అన్నతో కలిసి మల్టీ స్టారర్ చేయొచ్చు కదా.. మీ అన్న అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో కలసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడగ్గా.. నేను మా అన్నయ్య కలిసి నటించడానికి అవకాశం ఉన్న కథ ఇంతవరకూ దొరకలేదు. అలాంటి కథ కుదిరితే తప్పకుండా అన్నయ్యతో చేస్తాను అన్నారు. అయితే తన ఆప్షన్ లో మాత్రం చైతూ లేడు అన్నట్టుగా మాట్లాడాడు అఖిల్. మల్టీ స్టారర్ సినిమాలను గురించి నేను ఆలోచన చేయలేదుగానీ, ఒకవేళ చేయవలసి వస్తే మాత్రం రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని అన్నాడు. ఇక రామ్ చరణ్ తో కథ దొరికితే సినిమా చేయాలని ఉంది అన్నారు అఖిల్.

అఖిల్ హీరోగా చేసిన భారీ యాక్షన్ సినిమా ఏజంట్ రిలీజ్ కు రెడీగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈమూవీ ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈసినిమా ద్వారా సాక్షీ వైద్య.. హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీమ్. అఖిల్ ఈసారి ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. ఏ ఛాన్స్ వదిలిపెట్టకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు.

Updated On 20 April 2023 9:58 PM GMT
Ehatv

Ehatv

Next Story