✕
Akhil Akkineni : అక్కినేని అఖిల్‌కి అగ్నిపరీక్ష.. ఏజెంట్ బేజారెత్తించే బడ్డెట్
By EhatvPublished on 25 April 2023 6:53 AM GMT
మొదటినుంచీ కూడా అక్కినేని అఖిల్(Akhil Akkineni) కొంప ముంచుతున్నది బడ్జెట్ భూతమే. వివి వినాయక్(V.V.Vinayak) దర్శకత్వంలో అఖిల్ టైటిల్(Akhil Title)తో వచ్చిన తొలిచిత్రం కూడా అనుకున్నదాని కన్నా తడిసి మోపెడై, విడుదల టైంలో నానా అగచాట్లు పడిందని పరిశ్రమంతా నెత్తి మొత్తుకుంది.

x
Akhil Akkineni
-
- మొదటినుంచీ కూడా అక్కినేని అఖిల్(Akhil Akkineni) కొంప ముంచుతున్నది బడ్జెట్ భూతమే. వివి వినాయక్(V.V.Vinayak) దర్శకత్వంలో అఖిల్ టైటిల్(Akhil Title)తో వచ్చిన తొలిచిత్రం కూడా అనుకున్నదాని కన్నా తడిసి మోపెడై, విడుదల టైంలో నానా అగచాట్లు పడిందని పరిశ్రమంతా నెత్తి మొత్తుకుంది. డిస్ట్రిబ్యూటర్ల బెడద తట్టుకోలేక చివరికి దర్శకుడు వివి వినాయక్ తన రెమ్యూనరేషన్లో కొంత భాగం తిరిగి కౌన్సిల్ ఆదేశం మేరకు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని అందరూ గుసగుసలాడుకున్నారు.
-
- ఇప్పటివరకూ అఖిల్ ఇమేజ్‌ని పెంచడం మాట అటుంచి, అసలు డిపాజిట్లైనా దక్కుతాయా అన్నట్టుగా అయిపోయింది అఖిల్ పరిస్థితి. ఇప్పుడు కూడా అఖిల్‌కి అదే పరిస్థితి మళ్ళీ మొదలైంది. సురేందర్ రెడ్డి(Surendra Reddy)దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments)పతాకం మీద అనిల్ సుంకర(Anil Sunkara)నిర్మించిన ఏజెంట్ చిత్రం(Agent Movie)కూడా నడుం విరగ్గొట్టేసింది అంటున్నారు ట్రేడ్‌లో. పాతిక ముప్ఫై కోట్లలో తీద్దామనుకున్న ఏజెంట్ కాస్తా చిట్టచివరికి 80 కోట్లు టచ్ అయిందని, అంత ఖర్చును తట్టుకునే స్టామినా అఖిల్‌కి ఉందా అని అందరూ ఆయోమయంలో పడ్డ మాట కూడా వాస్తవమే. ఇంకా పూర్తిగా బిజెనెస్ కూడా పూర్తవకుండానే ఈ నెల 28న సినిమా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కాకపోతే, నిర్మాత అనిల్ సుంకర్ మాత్రం మహా ధీమాగా ఉన్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా బాగా వచ్చింది కాబట్టి, విడుదల తర్వాతైనా ఏజెంట్ సినిమా గడ్డు పరిస్థితిని దాటుతుందనే అంచనాలలో అనిల్ ఉన్నట్టు భోగట్టా. అప్కోర్స్....ఇదే విషయాన్ని ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కూడా ఇక్కడ బల్ల లేదు కాబట్టి గుద్ది చెప్పలేకపోతున్నా...అయినా అదే కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నా....ఏజెంట్ గ్యారెంటీగా హిట్ అవుతుందన్న ఫీలింగ్‌తో మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచిందా రోజు.
-
- అఖిల్ సాధ్యమైనంత వరకూ కష్టపడ్డాడన్నది అందరికీ అర్ధమవుతోంది. కోవిడ్ కారణంగా సినిమా డిలే అయిపోయి, ఖర్చు కొంప ముంచే స్థాయికి చేరిపోవడం వల్ల ఏజెంట్ ఇప్పుడీ విమర్శలను, వ్యాఖ్యానాలను ఎదుర్కొనవలసి వస్తోంది కానీ, లేకపోతే చాలా సేఫ్ ప్రాజెక్ట్ అయి ఉండేది అన్నది కూడా గట్టిగానే వినిపిస్తోంది. మొన్న వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, విజయవాడలో జరిగిన హంగామా, అఖిల్ ఎత్తు మీద నుంచి సాహసోపేతంగా దూకడం వంటి పాయంట్తో ఏజెంట్ పబ్లిక్‌లో గానీ, అక్కినేని అభిమానులలో గానీ ఇంప్రసివ్గానే స్కోర్ చేసింది. పైగా ఫ్రెష్ జోనర్ ఫిల్మ్ కావడం కూడా ఏజెంట్‌కి ప్లస్ పాయంట్గానే కనబడుతోంది. చూడాలి. అఖిల్ మాటల్లో కూడా బాగా మెచ్యూరిటీ కనబడుతోంది వినిసిస్తోంది. చూడాలి....మరి అఖిల్ స్టార్స్ ఏం చెబుతున్నాయో? " Written By Nagendra Kumar"

Ehatv
Next Story