✕
Agent Movie Review : ఏజెంట్ కొత్తగానే ఉంది. కానీ....
By EhatvPublished on 28 April 2023 1:27 AM GMT
అఖిల్ అక్కినేనితో ఇటువంటి జోనర్‌తో ఏజెంట్ సినిమాని తెరకెక్కించడం నిజంగా అభినందనీయమే. అఖిల్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా, ఎంతో స్టయిలిష్‌గా, యాక్టివ్‌గా క్యారెక్టర్ ఆర్క్‌ని పెంచడానికి చాలా కష్టపడ్డాడు. దానికి పలితం కూడా తెరమీద కొట్టొచ్చినట్టు కనిపించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే స్పై ధ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం కూడా ఏమంత చిన్నపాటిది కాదు.

x
agent
-
- అఖిల్ అక్కినేనితో ఇటువంటి జోనర్‌తో ఏజెంట్ సినిమాని తెరకెక్కించడం నిజంగా అభినందనీయమే. అఖిల్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా, ఎంతో స్టయిలిష్‌గా, యాక్టివ్‌గా క్యారెక్టర్ ఆర్క్‌ని పెంచడానికి చాలా కష్టపడ్డాడు. దానికి పలితం కూడా తెరమీద కొట్టొచ్చినట్టు కనిపించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే స్పై ధ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం కూడా ఏమంత చిన్నపాటిది కాదు.
-
- కోటానుకోట్ల రూపాయల ఖర్చుతో, భారమైన బడ్జెట్‌తో చేసిన ఏజెంట్ ఎంగేజింగ్గానే ఫస్టాప్ అంతా చురుగ్గా, నిర్మాణాత్మకంగానే సాగింది. మొత్తం దృష్టినంతా అఖిల్ క్యారెక్టర్ మీదనే పెట్టి, అందుకు అవసరమైన భారీ తారాగణాన్ని మొత్తం జస్ట్ అవసరానికి మాత్రమే ఉపయోగించుకుని, స్పీడుగా కథని ముందుకు నడపాలనే ప్లాన్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి బాగానే సక్సెస్ అయ్యాడు.
-
- ఇంక సరే ప్రాడక్షన్ వేల్యూస్‌ని ఏ ఒక్క విషయంలో కూడా వేలెత్తి చూపించలేనట్టుగా చాలా రిచ్‌గా, భారీ బందోబస్తుతోనే ప్రతీ షాటూ, ప్రతీ సీను చాలా ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి. కథ కోరుకున్న విధంగా ఫారెన్ లొకేషన్స్‌ని యధాశక్తి వాడుకుంటూ, ఎక్కడా రాజీలేకుండా సీన్స్‌ని పండించడానికి ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మాత అనిల్ సుంకర్ డబ్బుని తెరమీద కుమ్మరించారు.
-
- మళ్ళీ చెప్పాల్సని మాట, అఖిల్ ఇంతకు ముందు సినిమాల కన్నా కూడా చాలా మెచ్యూర్డ్‌గా, గ్రేట్ ప్రిపరేషన్‌తో కలివిడిగా, హుషారుగా చేసి, కొన్నికొన్ని సీన్స్‌లో భలే అనిపించాడు. కాకపోతే, అఖిల్ చాక్లైట్ ఫేస్‌కి, గెడ్డం, రఫ్‌నెస్ మాత్రం ఏమంత సూటు కాలేదని చెప్పక తప్పదు. అసలింత యాక్షన్, వయొలెన్స్, కుట్రలు, టిట్ ఫర్ టేట్ డ్రామాని టెంపో మిస్ కాకుండా చూసుకునే బదులు, మళ్ళీ ఎవరు అడిగారని రొమాన్సు, పాటల మీద పడ్డారో మాత్రం అర్ధం కాలేదు.
-
- అసలు కంటెంట్ స్రాంగ్‌గా ఉన్న చాలా సినిమాలకు ఇటీవలి రోజులలో పాటల జోలికే దర్శకుడు పోవడం లేదు. పాటల వల్ల సినిమా రన్‌కి అంతరాయం తప్పితే ఏమీ ఒరగిందే లేదు ఏజెంట్ సినిమాలో. మరీ కథ గురించి చెప్పాలంటే వక్కంతం వంశీ మరింత శ్రద్ధ కథానిర్మాణం మీద పెట్టి ఉంటే కథకి ఇంకా న్యాయం జరిగి ఉండేది.
-
- నిజానికి ఇటువంటి జోనర్ సినిమాలు తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమాలలోనే చాలా తక్కువ. అలాటిది ఎత్తుకుంటూనే ఇటువంటి కథను ఎత్తుకుని, మళ్ళీ తప్పదన్నట్టు మధ్యమధ్యలో ఫామిలీ డ్రామా సీన్లు....బేసిక్ కథను కొంత వరకూ బలహీనపరిచడానికి ఉపకరించాయేమోననిపిస్తుంది.
-
- మమ్ముట్టి లాటి స్టార్ హీరోని పెట్టడం వల్ల సినిమాకి తిరుగులేని ఫ్రెష్‌నెస్ వచ్చిందన్న మాట పచ్చినిజం. కానీ, ఆ క్యారెక్టర్ని ఇంకొంత కథలో ఇన్వాల్వ్ చేసి ఉంటే మమ్ముట్టిని పెట్టుకున్న ప్రయోజనం నెరవేరేది. మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్‌రాజు లాటి వాళ్ళు కథని మోసుకెళ్ళి, సినిమా విఉయవంతమయ్యేందుకు దోహదపడేంత అవకాశాన్ని పొందలేకపోయారు. ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సుపర్బ్. Written by నాగేంద్ర

Ehatv
Next Story