akhil akkineni and naga chaitanya failure in films
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న చరిత్ర అంతా, ఇంతా కాదు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ (NTR),ఏఎన్ఆర్ (ANR).నాగేశ్వరరావు ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చి అద్భుతమైన సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా తొలినాళ్ళలో అగ్రనాయకులలో నాగేశ్వరరావు ఒకరు. 300కు పైగా చిత్రాల్లో అయన నటించారు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా అయన ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అయన సినీజీవితానికి తెరలేచింది. అప్పటి నుండి అయన వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వెండి తెరపై 75 సంవత్సరాల పైగా నటించి ఎవరూ అందుకోలేని రికార్డును నెలకొల్పారు.
అక్కినేని వారసుడిగా.. అయన నటన ప్రస్థానాన్ని కొనసాగింపుగా నాగార్జున (Nagarjuna Akkineni) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున మొదటి చిత్రం విక్రం(Vikram), 1986 మే 23న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం హిందీ హీరోకి రీమేక్. ఈ సినిమా తరువాత నాగార్జున నాలుగు సినిమాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మజ్ను(Majnu) సినిమాతో నాగార్జున సూపర్ హిట్ అందుకున్నారు . నాగార్జున, నాగేశ్వరరావు కలసి నటించిన మొదటి సినిమా కలెక్టరుగారి అబ్బాయి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన నాగార్జున అగ్ర కధానాయకుల్లో ఒకరిగా నిలిచారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకు పోటీగా నాగార్జున సినిమాలు ఉండేవి.. ఒకానొక సమయంలో వరుస విజయాలతో ఇండస్ట్రీ టాప్ హీరోగా నాగార్జున నిలిచారు.
నాగేశ్వరరావు, నాగార్జున తెలుగు సినిమాల్లో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని.. అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.. అక్కినేని వారసత్వాన్ని నాగార్జున కొనసాగిస్తే, అదే పరంపరను నిలబెట్టడంలో నాగార్జున కొడుకులు విఫలమయ్యారనే చెప్పాలి. నాగేశ్వరరావు, నాగార్జునలాగా అభిమానులను అలరించలేకపోయారు. 'జోష్' సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు నాగ చైతన్య(Naga Chaitanya).. ఏమాయ చేసావె(Ye Maaya Chesave), 100 % లవ్, ప్రేమమ్(Premam),మజిలీ(Majili),లవ్ స్టోరీ(Love Story) వంటి సినిమాలు విజయం సాధించినా అనుకున్నంత స్థాయిలో పేరును సాధించలేకపోయారు.
అఖిల్ అక్కినేని(Akhil Akkineni).. సిసింద్రీ సినిమాతో చిన్న వయసులోనే వెండితెరపై మెరిసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.. కానీ పెద్దయ్యాక ఆయనకంటూ చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు.. మొత్తం ఐదు సినిమాల్లో నటించిన ఈ యువ హీరోకి అన్నీ పరాభవాలే.. భారీ బడ్జెట్తో.. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమాలు అన్నీ అభిమానులను పేరును.. అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్(Agent).. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఘోరమైన పరాభవాన్ని అందుకుంది. నాగ చైతన్య కంటే.. అఖిల్ పైనే నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. తాత పేరును నిలబెడతాడనుక్కున అఖిల్ మాత్రం ప్రతీసారి నిరాశపరుస్తూనే వస్తున్నాడు..