విభిన్న పాత్రలను పోషించడంలో నటుడు అజిత్(Ajith) ఎప్పుడూ వెనుకంజ వేయరు. ఏదీ పడితే అది ఒప్పుకోరు. చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటారు. ఇప్పుడు ఓ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళుల ఆరాధ్య పాలకుడు రాజరాజ చోళుడు(King Chola) పాత్రను పోషించబోతున్నారన్న తమిళ సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చారిత్రక కథలను తెరకెక్కించడం పెద్ద కష్టమైన విషయం కాదు.
విభిన్న పాత్రలను పోషించడంలో నటుడు అజిత్(Ajith) ఎప్పుడూ వెనుకంజ వేయరు. ఏదీ పడితే అది ఒప్పుకోరు. చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటారు. ఇప్పుడు ఓ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళుల ఆరాధ్య పాలకుడు రాజరాజ చోళుడు(King Chola) పాత్రను పోషించబోతున్నారన్న తమిళ సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చారిత్రక కథలను తెరకెక్కించడం పెద్ద కష్టమైన విషయం కాదు. గ్రాఫిక్స్‌తో(Graphics) సినిమాను మరింత జనరంజకంగా నిర్మించవచ్చు. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించాయి. అలాగే ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాను రెండు భాగాలుగా రూపొందించి విజయం సాధించారు. ఇందులో జయం రవి రాజరాజ చోళుడుగా నటించారు. చాలా కాలం కిందట దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేశన్ రాజరాజ చోళన్ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమా శివాజీకి ఎంతో పేరు తెచ్చింది. గంభీరమైన నటనా కౌశలంతో శివాజీ అలరించారు. ఆ పాత్ర తనకోసమే పుట్టిందన్నట్టుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాను రంగుల్లో నిర్మించారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్(Shankar) కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి(Velpari) అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్‌తో కలిసి కథా చర్చలు జరుపుతున్నారట! ఇలాంటి తరుణంలో నటుడు అజిత్ కూడా చారిత్రక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారట! ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కానీ, దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ బంధులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.