తమిళ స్టార్‌ హీరో అజిత్‌(Ajith) సినీ కెరీర్‌ను జాగ్రత్తగా మలచుకుంటూ వచ్చారు. ఇప్పుడూ అదే రూట్‌లో వెళుతున్నారు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అజిత్‌ నటించిన తుణిపు విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. తెలుగులో ఇది తెగింపు(Thegimpu) పేరుతో విడుదలయ్యింది. ఏడాది నుంచి అజిత్‌ తన తర్వాతి సినిమాను ప్లాన్‌ చేసుకోకపోవడమే ఆశ్చర్యం.

తమిళ స్టార్‌ హీరో అజిత్‌(Ajith) సినీ కెరీర్‌ను జాగ్రత్తగా మలచుకుంటూ వచ్చారు. ఇప్పుడూ అదే రూట్‌లో వెళుతున్నారు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అజిత్‌ నటించిన తుణిపు విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. తెలుగులో ఇది తెగింపు(Thegimpu) పేరుతో విడుదలయ్యింది. ఏడాది నుంచి అజిత్‌ తన తర్వాతి సినిమాను ప్లాన్‌ చేసుకోకపోవడమే ఆశ్చర్యం. విడాముయిర్చి అనే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించారు కానీ, ఈ ప్రకటన వచ్చి కూడా చాలా కాలం అయ్యింది. ఈ సినిమాకు మొదటి నుంచి అవరోధాలే ఎదురవుతున్నాయి. స్టార్‌ హీరోయిన్‌ నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. చర్చలు కూడా జరిగాయి. విఘ్నేశ్‌ శివన్‌ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ చిత్రం నుంచి ఆయనను అనూహ్యంగా తప్పించారు. ఇందులో అజిత్‌ ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. నిజమేమిటో తెలియకపోయినా తర్వాత విడాముయిర్చి దర్శక బాధ్యతలను మగిళ్‌ తిరుమేణి చేపట్టారు.

అప్పుడైనా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ పనుల్లో వేగం వస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. ఇంతకుముందు ఆగస్టు మొదటివారంలో విడాముయిర్చి సెట్స్‌ మీదకు వెళుతుందని అన్నారు. అయితే ఇది మళ్లీ వాయిదా పడిందని సమాచారం. సెప్టెంబర్‌ నెలలో ప్రారంభం కానున్నట్టు తాజా సమాచారం. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడటంతో ఇందులో నాయకిగా నటించాల్సిన త్రిష ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అజిత్‌ సినిమాకు కాల్‌షీట్లు అడ్జెస్ట్‌ చేయలేని పరిస్థితి త్రిషది. అయినప్పటికీ కాస్త ఆలస్యమైనా ఎలాగోలా విడాముయిర్చి సినిమాలో నటిస్తానని త్రిష(Trisha) తెలిపారట! అయితే అజిత్‌ ఆమెకు అడ్డుపడుతున్నారట! ఆయన దృష్టి ఇప్పుడు తమన్నా భాటియాపై పడిందట! రజనీకాంత్‌ హీరోగా వస్తున్న జైలర్‌ సినిమాలో కావాలా పాటతో ఆమె ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకోవడమే ఇందుకు కారణమట! అయితే హీరోయిన్‌కు వచ్చిన క్రేజ్‌ను వాడుకోవాలనే ఆలోచనలో అజిత్‌ ఉండటం మంచిది కాదంటున్నారుకొందరు. తమన్నకు త్రిష ఏమాత్రం తీసిపోరని చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో..!

Updated On 31 July 2023 3:10 AM GMT
Ehatv

Ehatv

Next Story