అవ్వడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజయ్(ajay). విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా భయపెట్టిన అజయ్.. ఇంత కాలానికి మరోసారి కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ లోకనిపించాడు.

అవ్వడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజయ్(ajay). విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా భయపెట్టిన అజయ్.. ఇంత కాలానికి మరోసారి కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ లోకనిపించాడు.

ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్.. రీసెంట్ గా మళ్ళీ బిజీ అవుతున్నాడు. కంప్లీట్ గా చెంజ్ అయ్యి.. స్లిమ్ లుక్ లోకి మారిపోయిన అజయ్.. తాజాగా నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha). ఈ సినిమాలో అజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అప్పట్లో విక్రమార్కుడు(Vikramarkudu) సినిమాలో.. టిట్లాగా(Tiltla) భయపెట్టిన అజయ్.. తాజాగా మరోసారి అఘోరా లుక్ లో మరోసారి భయపెట్టబోతున్నాడు.

విరూపాక్ష ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ ట్రైలర్ లో అఘోరాగా అజయ్‌ కనిపించి షాక్ ఇచ్చాడు. అఘోరాగా అజయ్ విజువల్స్‌ అద్భుతంగా కనిపిస్తున్నాయి. విరూపాక్షలో అజయ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నెట్టింట అజయ్ అఘోరా లుక్‌కు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈసినిమా హిట్ అయితే.. విరూపాక్ష సినిమాతో అజయ్‌ కెరీర్‌ మరోసారి టర్న్ అయ్యే అవకాశం ఉంది.

సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) హీరోగా.. సముక్తా మీనన్(Samyuktha menon) జంటగా.. విరూపాక్ష తెరకెక్కింది. కార్తీక్ దండు(Karthik dhandu) దర్శకత్వంలో సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈసినిమా ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈసినిమాకు కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ విరూపాక్షను నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు నటిస్తున్నారు. అజయ్‌ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్‌లో(Pushpa: The rule) కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Updated On 18 April 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story