సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajani Kanth) నటించిన 'లాల్ సలామ్(Lal Salaam)' చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. లాల్ సలామ్ సినిమాను కువైట్‌(Kuwait)లో విడుదల చేయకూడదని అక్కడి అధికారులు ప్రకటించారు. సున్నితమైన కంటెంట్ కారణంగా నిషేధించినట్లు తెలుస్తోంది.స్థానిక క్రికెట్(Cricket) మ్యాచ్ కారణంగా సాగే హిందూ, ముస్లిం పోరాటాల సెన్సిటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిడిల్ ఈస్ట్‌(Middle East)లో, ఈ రకమైన చిత్రాలకు సెన్సార్‌(Censor) క్లియర్ దక్కడం చాలా కష్టమే! అందుకే లాల్ సలామ్ సినిమా అక్కడ విడుదలవ్వడం కష్టమేనని తెలుస్తోంది.

హృతిక్ రోషన్(hrithik Roshan) హీరోగా నటించిన ఫైటర్(Fighter) సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక కంటెంట్ ఉన్న కారణంగా మొత్తం మిడిల్ ఈస్ట్‌లో నిషేధించారు. ఇప్పుడు కువైట్‌లో లాల్ సలామ్ సినిమాను నిషేధించచారు. మరి లాల్ సలామ్ టీమ్ రిలీజ్ కి ముందే సెన్సార్ క్లియర్ చేస్తుందో లేక మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ లో కూడా బ్యాన్ అవుతుందో లేదో చూడాలి. ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajanikanth) దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్(AR Rahman) అందించారు.

Updated On 3 Feb 2024 12:45 AM GMT
Yagnik

Yagnik

Next Story