సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) డౌన్‌ టు ఎర్త్‌ మనిషి.

సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) డౌన్‌ టు ఎర్త్‌ మనిషి. బయట చాలా సింపుల్‌గా ఉంటాడు. అందరితోనూ కలిసిపోతాడు. సినిమాలు లేని సమయంలో కుటుంబ సభ్యులతో గడుపుతాడు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. హిమాలయాలకు వెళ్లిపోతుంటారు. ఈ స్టార్‌ హీరో ఫ్యామిలీమ్యాన్‌ కూడా! తాతయ్య(Grand father) బాధ్యతను చక్కగా పోషిస్తున్నాడు. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని స్వయంగా దగ్గరుండి స్కూల్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆయన కూతురు సౌందర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమె ఏం చెప్పందంటే 'ఇవాళ ఉదయం నా కొడుకు వేద్‌ స్కూల్‌కు వెళ్లనని మారం చేశాడు. అప్పుడు సూపర్‌హీరో (అంటే రజనీకాంత్‌ అన్నమాట) స్వయంగా వేద్‌ను స్కూల్‌కు తీసుకెళ్లాడు.

ఆఫ్‌ స్క్రీన్‌లో అయినా ఆన్‌ స్క్రీన్‌లో అయినా ప్రతి పాత్రనూ మీరు ఉత్తమంగా పోషిస్తారు నాన్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు తన కుమారుడిని స్కూల్‌కు తీసుకెళ్తున్న ఫొటోలను యాడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ అగ్రదర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా పేరు కూలీ.. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రజనీకాంత్‌కు ఇది 171 సినిమా. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే రజనీకాంత్‌ నటిస్తున్న 170వ చిత్రం వేట్టయాన్‌ (Vettayan). ఈ సినిమాకు జై భీమ్‌ ఫేమ్‌ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో కిషోర్‌, రితికా సింగ్‌, దుషార విజయన్‌, అభిరామి, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story