వచ్చే ఏడాది సంక్రంతి(Sankranthi) బరిలో నిలవబోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). భారీ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న సినిమా లాల్ సలాం(Lal Salam). రజనీకాంత్ ముద్దుల కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో.. విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈసినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముంబయి డాన్ మొయిద్దీన్ భాయ్‌గా కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం.

Lal Salaam Movie Release Date
వచ్చే ఏడాది సంక్రంతి(Sankranthi) బరిలో నిలవబోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). భారీ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న సినిమా లాల్ సలాం(Lal Salam). రజనీకాంత్ ముద్దుల కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో.. విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈసినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముంబయి డాన్ మొయిద్దీన్ భాయ్‌గా కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేనయడానికి రెడీ అవుతున్నారు టీమ్. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు లాల్ సలాం తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారితో మా అనుబంధం కొనసాగుతుండటం మాకెంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్ మేరకు ఆయన ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించారు’’ అని వెల్లడించారు. లాల్ సలాం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
