తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈ వయసులోనూ యువహీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఆయన నటించిన లాల్ సలామ్(Lal salam) సినిమా రిలీజ్ కాబోతున్నది.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈ వయసులోనూ యువహీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఆయన నటించిన లాల్ సలామ్(Lal salam) సినిమా రిలీజ్ కాబోతున్నది. ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya rajinikanth) దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో గ్రాండ్‌గా జరిపారు. ఈ వేడుకలో రజనీకాంత్‌పై వస్తున్న ట్రోల్స్‌పై ఐశ్వర్య స్పందించారు. 'మా నాన్న సంఘీ(Sanghi) అంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. ఆన్‌లైన్ నెగెటవిటీ గురించి నా టీమ్ తరచూ చెబుతుంటుంది. అలాగే నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి కూడా నా టీమ్ నాకు చెప్పింది. ముము కూడా మనుషులమే. మాక్కూడా భావోద్వేగాలు ఉంటాయి. నా తండ్రిని సంఘీ అంటూ విమర్శలు చేస్తున్నారు. సంఘీ అంటే మొదట్లో నాకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడే దాని అర్థం తెలుసుకున్నాను. బీజేపీపి మద్దతు ఇచ్చే వారిని సంఘీ అని పిలుస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. మా నాన్న సంఘీ కాదు. హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారే అయితే లాల్‌సలామ్ సినిమాలో మొయినుద్దీన్ భాయ్ పాత్ర వేసేవారు కాదు. ప్లీజ్ ఇక నుంచి ఇలాంటివి మానేయండి' అంటూ ఐశ్వర్య వేడుకున్నారు. కూతురు ఈ మాటలు చెబుతున్నప్పుడు అక్కడే ఉన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు.