రజనీకాంత్(Rajinikanth) కు గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు లాల్ సలామ్(Lal Salaam)టీమ్. సూపర్ స్టార్ కూతురు.. హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు సబంధించి .. తాజా అప్ డేట్ హల్ చల్ చేస్తోంది.

రజనీకాంత్(Rajinikanth) కు గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు లాల్ సలామ్(Lal Salaam)టీమ్. సూపర్ స్టార్ కూతురు.. హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు సబంధించి .. తాజా అప్ డేట్ హల్ చల్ చేస్తోంది.

రజనీకాంత్ గారాల కూతురు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న సినిమా లాల్ సలాం'(laal Salam) .. ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal) - విక్రాంత్ సంతోష్(Vikranth santhosh) లీడ్ రోల్స్ చేస్తుండగా.. అత్యంత ప్రధానమైన పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth) నటిస్తున్నారు. క్రికెట్(Cricket) బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాదు క్రికెట్ నేపథ్యం.. బెట్టింగ్స్ వాటి మధ్య జరిగే గొడవలు .. మాఫియాతో లింకుల చుట్టూ అల్లుకున్న ఈ కథ లాల్ సలాం.

ఈ సినిమాలో రజనీకాంత్ 'మొయిదీన్ భాయ్'(Moideen Bhai) గా మాఫియా డాన్(Mafia Don) పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకూ సూపర్ స్టార్ చాలా సినిమాల్లో మాఫియా పాత్రలు అద్భుతంగా చేశారు. 'బాషా'(Basha) నుంచి 'కాలా'(Kala) వరకూ ఆయన చాలానే మాఫియా డాన్ పాత్రలను చేసినప్పటికీ, ఈ సినిమాలోని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. గతంలో చేసిన డాన్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉండబోతున్నట్టు తెలస్తోంది.

ఇక ఈసినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా.. తెలుగు నటి జీవితా రాజశేఖర్ నటించారు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో రజనీ పాత్రకి సంబంధించిన పోర్షన్ షూటింగు పూర్తయింది. ఇక సూపర్ స్టార్ కు మూవీ టీమ్ గ్రాండ్ సెండాఫ్ ఇచ్చారు. సినిమా టీమ్ అంతా కలిసి ఆయనచేత కేక్ కట్ చేయించి హ్యాపీగా వీడ్కోలు పలికారు. లైకా ప్రొడక్షన్స్ - రెడ్ జెయింట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక రజనీ తాజా చిత్రంగా రూపొందిన 'జైలర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 12 July 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story