ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) పదహారణాల తెలుగు అమ్మాయి. ఒకప్పటి హీరో రాజేశ్(Hero Rajesh) కూతురు. హాస్యంతో అందరినీ అలరించిన శ్రీలక్ష్మి మేనకోడలు. కాకపోతే తెలుగులో కంటే తమిళ చిత్రసీమలోనే ఐశ్వర్యకు మంచి పేరు వచ్చింది. ప్రతిభావంతురాలైన నటిగా అక్కడ గుర్తింపు సంపాదించుకుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మహిళా ప్రధాన ఇతివృత్తాలకు ప్రాధాన్యమిస్తూ నటనలో తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు.
ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) పదహారణాల తెలుగు అమ్మాయి. ఒకప్పటి హీరో రాజేశ్(Hero Rajesh) కూతురు. హాస్యంతో అందరినీ అలరించిన శ్రీలక్ష్మి మేనకోడలు. కాకపోతే తెలుగులో కంటే తమిళ చిత్రసీమలోనే ఐశ్వర్యకు మంచి పేరు వచ్చింది. ప్రతిభావంతురాలైన నటిగా అక్కడ గుర్తింపు సంపాదించుకుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మహిళా ప్రధాన ఇతివృత్తాలకు ప్రాధాన్యమిస్తూ నటనలో తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు. ఐశ్యర్య రాజేశ్ సినిమా అంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆరు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అవన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం. కెరీర్ తొలినాళ్లలోనే కాకా ముట్టై(Kaakkaa Muttai) అనే సినిమాలో ఇద్దరు చిన్నారుల తల్లిగా నటించి శెభాష్ అనిపించుకున్నారు. ఆ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్లంతా మెచ్చుకున్నారు. విమర్శల నుంచి ప్రశంసలు లభించాయి. అయినా ఐశ్వర్య రాజేశ్ అవకాశాలు లేక ఏడాది పాటు ఖాళీగా ఉన్నారట! ఈ విషయాన్ని ఆమె తెలిపారు. 'నటిగా నిరూపించుకోవాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమే బెటర్ అనుకున్నాను. నా సినిమాలో నేనే కథానాయకుడిని కావాలనుకున్నాను. అప్పటి నుంచి నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నా కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. నన్ను అభిమానించే ప్రేక్షకులు ఎక్కువయ్యారు'. అని ఐశ్వర్య రాజేశ్ తెలిపారు. ఇటీవల ఫర్హానా(Farhana) అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఐశ్వర్య. ప్రస్తుతం ఓటీటీలో ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.