నాలుగు సంవత్సరాల కిందట వచ్చిన కౌసల్యా కృష్ణమూర్తి(Kousalya Krishnamurthy) సినిమాతో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ వంటి తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఇక్కడ ఎందుకో బ్రేక్ రాలేదు. కాకపోతే ఆమె అన్ని పాత్రలను ఒప్పుకోరు. ఎంపిక చేసుకున్న సినిమాల్లోనే నటిస్తారు.
నాలుగు సంవత్సరాల కిందట వచ్చిన కౌసల్యా కృష్ణమూర్తి(Kousalya Krishnamurthy) సినిమాతో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ వంటి తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఇక్కడ ఎందుకో బ్రేక్ రాలేదు. కాకపోతే ఆమె అన్ని పాత్రలను ఒప్పుకోరు. ఎంపిక చేసుకున్న సినిమాల్లోనే నటిస్తారు. గ్లామర్ పాత్రలకు అతీతంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే పోషిస్తారు. అందుకే తమిళనాట ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో రాణించాలంటే మేని ఛాయ అడ్డు కాదని, నటన మాత్రమే ఇంపార్టెంట్ అన నిరూపించారు ఐశ్వర్య రాజేశ్. ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఫర్హానా సినిమా తమిళంతో పాటు తెలుగు కూడా విడుదలై మంచి విజయం సాధించింది. నెల్సన్ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెల్వ రాఘవన్ ప్రధాన పాత్ర పోషించారు. కొడుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడికి చికిత్స చేయించడానికి తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మగవాళ్ల కామవాంఛ కోరకలు మాటల్లో తీర్చే ఓ కాల్ సెంటర్‌లో ఆమెకు ఉద్యోగం వస్తుంది. జాబ్ నచ్చకపోయినా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మనసు చంపుకుని ఉద్యోగం చేస్తుంటుంది. ఇంట్లో వాళ్లకు ఆమె చేస్తున్న ఉద్యోగం సంగతి తెలియదు. అలా మగవాళ్ల కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఓ కాలర్ చాలా విచిత్రంగా మాట్లాడతాడు. అదే సమయంలో తను చేస్తున్న ఉద్యోగం గురించి ఇంట్లో వారికి తెలుస్తుంది. అప్పటి నుంచి ఆమెను సొంత వాళ్లే చీదరించుకుంటారు. మరోవైపు ఆ కాలర్ తనను వేధిస్తుంటాడు, వెంబటిస్తుంటాడు. ఆ తర్వాత ఫర్హానా జీవితం ఎలా మారింది అనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను సినిమా ఎదుర్కొంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా కొన్ని ముస్లిం సంఘాలు సినిమాను వ్యతిరేకించాయి. తమను తప్పుగా చూపించారని కొందరు కేసులు కూడా వేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ఓటీటీలో రాబోతున్నది. ఈ సినిమా హక్కులను సోని లివ్ సంస్థ దక్కించుకుంది. జూన్ 16వ తేదీ నుంచి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.