లాల్ సలామ్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, ఐశ్వర్య తన తొలి చిత్రం '3' ఫలితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

ఐశ్వర్య రజినీకాంత్ 9 సంవత్సరాల తర్వాత దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఆమె 2012లో ధనుష్- శ్రుతి హాసన్ కలిసి నటించిన ‘3’ సినిమాతో దర్శకత్వం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2014లో క్రైమ్ కామెడీ వై రాజా వాయ్‌కి దర్శకత్వం చేశారు. ఇటీవల విడుదలైన లాల్ సలామ్ సినిమాకు మళ్లీ దర్శకత్వం చేశారు. లాల్ సలామ్ తెలుగులో టోటల్ వాష్‌అవుట్ కాగా.. తమిళంలో పర్వాలేదనే విధంగా బిజినెస్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి హైప్ లేకుండా విడుదలైంది.

లాల్ సలామ్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, ఐశ్వర్య తన తొలి చిత్రం '3' ఫలితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొలవెరి పాటకు వచ్చిన బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందరినీ షాక్‌కి గురి చేసిందని.. పాట భారీ సక్సెస్ అవ్వడంతో సినిమా కంటెంట్‌ మీద ప్రభావం చూపించిందని ఆమె అన్నారు. చిత్రం కంటెంట్ చాలా సీరియస్‌గా ఉంటుంది.. కానీ కొలవెరి పాట చిత్రంపై భిన్నమైన అంచనాలను నెలకొల్పింది. దీని ఫలితంగా ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ చిత్రం ఇటీవలి రీ-రిలీజ్ & టెలికాస్ట్ సమయంలో మంచి ఆదరణ పొందింది. పాట మ్యాజిక్ తగ్గిపోవడంతో సినిమాను చూడడం.. జనాలకు నచ్చడం జరిగింది. అయితే కొలవెరి పాట అనిరుద్ కెరీర్‌కు సహాయపడినందుకు నేను సంతోషంగా ఉన్నానని ఐశ్వర్య అన్నారు.

Updated On 11 Feb 2024 11:41 PM GMT
Yagnik

Yagnik

Next Story