నన్ను ట్రోల్ చేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోండి అని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టుకెక్కారు.. ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల గారాల కూతురు.. అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య(Aaradhya). ఐశ్యర్యా రాయ్, అభినేష్ బచ్చన్ ల గారాల కూతురు ఆరాధ్య కోర్డును ఆశ్రయించింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు సబంధించి యూట్యూబ్ టాబ్లాయిడ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టులో కేసు ఫైల్ చేశారు. తాను మైనర్ ను కావడంతో..

నన్ను ట్రోల్ చేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోండి అని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టుకెక్కారు.. ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల గారాల కూతురు.. అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య(Aaradhya).

ఐశ్యర్యా రాయ్, అభినేష్ బచ్చన్ ల గారాల కూతురు ఆరాధ్య కోర్డును ఆశ్రయించింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు సబంధించి యూట్యూబ్ టాబ్లాయిడ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టులో కేసు ఫైల్ చేశారు. తాను మైనర్ ను కావడంతో.. తనపై సదరు యూట్యూబ్ ఛానల్ లో నిరాధారమైన వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడింది. అంతే కాదు... తన ఆరోగ్యం గురించి.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిగత జీవితంపై.. ఉన్నవి లేనివి కల్పించుకుని.. ఓ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆరాధ్య తన పిటిషన్‌లో ఆరోపించింది. తాను మైనర్ కాబట్టి.. నా హక్కులకు భంగం కలగుండా.. ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును అభ్యర్థించింది

ఇక గతంలో కూడా ఆరాధ్యపై ఇలాంటి ట్రోల్స్ చాలా వచ్చాయి.. అయితే ఈ ట్రోల్స్ పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ మండిపడ్డారు. ఇటువంటి ట్రోల్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే.. ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతోందో నేను అర్థం చేసుకోగలను. కానీ.. నా కూతురిపై ట్రోలింగ్ ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఏదైనా అనాలనుకుంటే నన్నే డైరెక్ట్‌గా అనండి అంటూ అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇక ఈ మధ్య ఐశ్యర్యా రాయ్, అభినేష్ బచ్చన్ లపై కూడా ఇలానేట్రోల్ చేశారు నెటిజన్లు. త్వరలో ఈస్టార్ జంట విడిపోబోతున్నారని. విడాకులకు రెడీ అవుతున్నారని. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. కొన్ని వేడుకలకు ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతోకలిసి వచ్చింది. అయితే గతంలో ఏ పార్టీకి అయినా.. ఏ వేడుకకు అయినా.. ముగ్గురు జంటగా వెళ్లేవారు. అభిషేక్ లేకుండా ఐశ్వర్య ఏ ఫంక్షన్ కు వెళ్ళేది కాదు. దాంతో ఈమధ్య ఐశ్వర్య మాత్రమేవేడుకల్లో కనిపించడం,అభిషేక్ జాడ లేకపోవడంతో.. ఈ పుకార్లు బయటకు పుట్టుకొచ్చాయి.

బచ్చన్ ఫ్యామిలీతో పాటు ఐశ్వర్య రాయ్ పై కూడా గతంలో ఎన్నో విమర్షలు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఉన్నాయి. హీరోలతో ఐశ్వర్య రొమాన్స్.. అభిషేక్ బచ్చన్ తో గొడవలు అంటూ.. ఎన్నో వార్తలు ప్రచారం జరిగాయి.. ఇక ఇప్పుడు వారి కూతుర ఆరాధ్యపై కూడా ఇలాంటివే జరుగుతుండటంతో.. కోర్టును ఆశ్రయించారు. ఇక ఈకేసును రేపు వీచారించబోతుందికోర్డు. ఈ విధంగా వారికి సమాచారం కూడా ఇచ్చింది. మరి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Updated On 20 April 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story