ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) తన తల్లిదండ్రుల(Parents) వివాహ వార్షికోత్సవం(Weding anniversary) సందర్భంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో(Instagram) వారి ఫొటోను షేర్ చేశారు. గతంలో వారిద్దరు దిగిన ఫొటోను షేర్ చేస్తూ వారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఫొటోలో కృష్ణరాజ్‌రాయ్(Krishnaraj Rai), బృందారాయ్(Brinda Rai) జంటగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా లవ్ యు ఎటర్నల్లీ, డియరెస్ట్ డార్లింగ్ మమ్మీ-దొడ్డా, డాడీ-అజ్జా అంటూ.. మీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడి ఆశీస్సులు ఉండాలని రాసుకొచ్చారు. ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్ 2017లో మరణించారు.

Aishwarya Rai
ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) తన తల్లిదండ్రుల(Parents) వివాహ వార్షికోత్సవం(Weding anniversary) సందర్భంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో(Instagram) వారి ఫొటోను షేర్ చేశారు. గతంలో వారిద్దరు దిగిన ఫొటోను షేర్ చేస్తూ వారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఫొటోలో కృష్ణరాజ్‌రాయ్(Krishnaraj Rai), బృందారాయ్(Brinda Rai) జంటగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా "లవ్ యు ఎటర్నల్లీ, డియరెస్ట్ డార్లింగ్ మమ్మీ-దొడ్డా, డాడీ-అజ్జా అంటూ.. మీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడి ఆశీస్సులు ఉండాలని రాసుకొచ్చారు. ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్ 2017లో మరణించారు.
ఈ మధ్య కాలంలో పూర్తిగా తన ఫ్యామిలీ లైఫ్‌పైనే ఫోకస్ పెట్టారు. పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. ప్రస్తుతానికి సినిమాల్లో నటించడంలేదు. 1999లో ‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ అనే సినిమా షూటింగ్‌లో ఐశ్వర్యకు అభిషేక్‌తో పరిచయం ఏర్పడినా...ఫ్రెండ్స్‌గా ఉన్నారు. 2006లో వారు కలిసి నటించిన ‘ఉమ్రవ్ జాన్’ అనే చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2007లో ముందుగా తన మనసులోని మాటను అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి ఐశ్వర్య కూడా అంగీకరించడంతో ఆ ఏడాదే వీరిద్దరికీ పెళ్లి కూడా జరిగింది. 2011లో ఈ జంటకు ఆరాధ్య పుట్టింది.
