✕
Aishwarya Lekshmi : రెడ్ కలర్ డ్రెస్సులో కుర్రాళ్లను ఊరిస్తున్న వైశాలి.. లుకింగ్ హాట్ అంటూ కమెంట్స్..!
By EhatvPublished on 10 May 2023 3:54 AM GMT
ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఈ భామ మలయాళం, తమిళం సినిమాలు చూసే వారికి ఈమె సుపరిచితమే. తెలుగు ఆడియన్స్ మాత్రం కాస్త తక్కువ పరిచయమనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ ఈ మధ్యే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. గత ఏడాది విడుదలైన ‘గాడ్సే’ (Godse) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుగు పెట్టింది ఈ కేరళ కుట్టి.

x
Aishwarya Lekshmi
-
- ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఈ భామ మలయాళం, తమిళం సినిమాలు చూసే వారికి ఈమె సుపరిచితమే. తెలుగు ఆడియన్స్ మాత్రం కాస్త తక్కువ పరిచయమనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ ఈ మధ్యే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. గత ఏడాది విడుదలైన ‘గాడ్సే’ (Godse) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుగు పెట్టింది ఈ కేరళ కుట్టి.
-
- సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) వైశాలి క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత అమ్ము అనే చిత్రంలో అముధ రవీంద్రనాథ్ (అమ్ము) గా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. అంతకంటే ముందు 2017లో మలయాళం చిత్రమైన మాయానది (Mayaanadhi) సినిమాతో మలయాళిలను ఆకట్టుకుంది ఐశ్వర్యలక్ష్మి.
-
- ఐశ్వర్య చాలా తక్కువ కాలంలోనే ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించింది. అయితే ఈ బ్యూటీ నివిన్ పౌలి నటించిన జందుకలుండే నట్టిల్ ఒరిదవెళ (Njandukalude Nattil Oridavela) చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఐశ్వర్యలక్ష్మి సౌత్‌లో ఈమె హాటెస్ట్ నటిగా మారింది. తిరువనంతపురానికి చెందిన ఈ భామ మొదట్లో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.
-
- ఈ బ్యూటీకి కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది మాయానది చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే ఆ చిత్రం 2017లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ ఒక్క సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. ఆమె అపర్ణరవి (అప్పు) క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించింది. మలయాళం, తమిళం, సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు చిత్ర పరిశ్రమవైపు కూడా అడుగులు వేసింది ఈ బ్యూటీ.
-
- రీసెంట్గా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) చిత్రంలో నటించి ఈ భామ. ఈ చిత్రంలో పూంగుజలి క్యారెక్టర్ చేసింది ఐశ్వర్యలక్ష్మి. పడవ నడిపే అమ్మాయిగా ఆమె కనిపించింది. ఇక ఈ భామ నటించిన కుమారి చిత్రం మలయళంలో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. మొన్న రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
-
- 1991 సెప్టెంబర్ 6న కేరళలోని త్రివేండ్రంలో పుట్టింది ఐశ్వర్యలక్ష్మి. అదే ఊరిలో హోలీ ఏంజెల్స్ కన్వెంట్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈబ్యూటీ. ఆ తర్వాత ఎర్నాకులంలో శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఐశ్వర్య. 2014లో మోడలింగ్ చేసిన ఆమె 2017లో వెండి తెరకు పరిచయం అయింది.
-
- ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్యలక్ష్మి (Aishwarya Lekshmi) సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ డ్రెస్సులో తన కొంటె చూపులతో అభిమానుల మనసులను దోచేస్తుంది ఈ బ్యూటీ. ఐశ్వర్య అందానికి ఇటు అమె అభిమానులతో పాటు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఎద అందాలను చూపుతున్న ఫొటోలకు మత్తెక్కుతోందంటున్నారు కుర్రకారు.
-
- ప్రస్తుతం ఐశ్వర్య తెలుగు, తమిళం, మలయళం సినిమాలతో బిజిబిజీగా గడుపుతోంది. ఇటు తెలుగులో కొన్ని సినిమాలకు సైన్ చేసింది. మలయాళంలో కింగ్ ఆఫ్ కొత్త (King of Kotha) అనే సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉంటున్న ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తన ఇన్‌స్టా గ్రామ్‌లో 2.9 మిలియన్ల ఫాలోవర్లను వెంటబెట్టుకుని తిప్పుకుంటోంది ఈ హాట్ భామ.

Ehatv
Next Story