మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)కి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. కట్టా కుస్తీ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా చూసిన వారు ఐశ్వర్య లక్ష్మిని అంత త్వరగా మర్చిపోరు. ఈమె మంచి నటే కాదు, మంచి నిర్మాత కూడా! మలయాళంలో మంచి సినిమాలను నిర్మించారు. సాయి పల్లవి నటించిన గార్గి సినిమాను తీసింది ఐశ్వర్య లక్ష్మినే!
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)కి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. కట్టా కుస్తీ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా చూసిన వారు ఐశ్వర్య లక్ష్మిని అంత త్వరగా మర్చిపోరు. ఈమె మంచి నటే కాదు, మంచి నిర్మాత కూడా! మలయాళంలో మంచి సినిమాలను నిర్మించారు. సాయి పల్లవి నటించిన గార్గి సినిమాను తీసింది ఐశ్వర్య లక్ష్మినే! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు లేడి ఓరియంటెడ్ కథా చిత్రాలపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు ఐశ్వర్య లక్ష్మి. అందుకు కారణాన్ని కూడా చెప్పారామె! స్త్రీల జీవితంలో పురుషులకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అందుకే స్త్రీ, పురుషులకు సమానత్వం కలిగిన కథలతో కూడినదే మంచి చిత్రాలన్నది తన అభిప్రాయామని చెప్పారు. అలా కాని సినిమాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. సినిమా అన్నది మన జీవితాలను, సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. అది సినిమా కావచ్చు, మన జీవితం కావచ్చు సమానత్వం మాత్రం ఉండాలని ఐశ్వర్య లక్ష్మి అన్నారు. తాను సినిమాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదని, మెడిసిన్ పూర్తి చేసిన తాను సినిమాల్లోకి రావడం అన్నది దైవ నిర్ణయమేనని చెప్పారు. తాను చదువుకు ప్రాధాన్యతను ఇచ్చే కుటుంబంలో పుట్టానని, నటిని అవుతానని ఏనాడూ అనుకోలేదన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అంటే చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయడమేనన్నది తన కుటుంబసభ్యుల భావన అని, సినిమా అలాంటి గౌరవాన్ని ఇచ్చేదిగా వారు భావించలేదని ఐశ్వర్య చెప్పారు. నిజం చెప్పాలంటే సినిమాలలో కొనసాగడం అంటే నిత్య పోరాటమేనని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.