ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా.. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేసిని ఈసినిమాను శ్రీనివాస కుమార్ నిర్మించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Baby Movie OTT Platform
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది బేబీ సినిమా(Baby Movie). ఇక ఈమూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ .
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా.. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేసిని ఈసినిమాను శ్రీనివాస కుమార్ నిర్మించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. దాదాపు చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా దాదాపు 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. జూలై 14న థియేటర్లలో రిలీజ్ అయిన బేబీ.. ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా... అది కూడా ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా ఎదరు చూస్తున్నారు. . తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ స్పందించిన అప్‌డేట్ వచ్చింది. ః
బేబీ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఏ రోజు స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని మాత్రం ఆగస్టు 18న చెబుతామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది ఆహా సంస్థ. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. చేరేను ఆహా లోనా.. క్యూట్ లవ్ స్టోరీ ‘బేబి’ రిలీజ్ డేట్ పై ప్రకటన రేపు వస్తుంది.” అని ఆహా ట్వీట్ చేసింది. దీంతో రిలీజ్ డేట్ ఏంటా అని అంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.