అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మొదలు పెడితే క్రిటిక్స్ వరకు విమర్శలు ఎదుర్కొన్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయడం మా తప్పే అని ప్రొడ్యూసర్ ఓ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. మరోవైపు కొవిడ్-19 కారణంగా ఈ చిత్రం చాలా సార్లు వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తాజా చిత్రం 'ఏజెంట్' బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మమ్ముట్టి, దినో మోరియా, సాక్షి వైద్య, ఊర్వశి రౌటేలా నటించారు. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, సాక్షి వైద్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచినా.. సినిమా ఘోర పరాజయం పాలైంది. విడుదలైన మొదటిరోజు 7 కోట్ల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మొదలు పెడితే క్రిటిక్స్ వరకు విమర్శలు ఎదుర్కొన్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయడం మా తప్పే అని ప్రొడ్యూసర్ ఓ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. మరోవైపు కొవిడ్-19 కారణంగా ఈ చిత్రం చాలా సార్లు వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.
ఆయన ట్విటర్ వేదికగా మాట్లాడుతూ.. ఇది ఒక్క టాస్క్ అయినప్పటికీ మేము విజయం సాధించేందుకు ప్రయత్నించామని.. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభించడం ఒకటైతే..కరోనా సహా లెక్కలేన్ని సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు. అందుచేత మేము ఫెయిల్ అయ్యామని అన్నారు. దీనికి మేము ఎలాంటి ఎక్స్యూజెస్ అడగడం లేదని.. ఈ కాస్ట్లీ తప్పు తెలుసుకున్నామని.. ఇలాంటి తప్పులు మళ్లీ ఎప్పుడూ చేయమన్నారు. మాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ క్షమాపణలు (apologises) కోరుతున్నామని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర (Anil Sunkara) కోరారు. మేము మళ్లీ చేయబోయే ప్రాజెక్ట్‌లో హార్డ్ వర్క్ చేసి.. ఇప్పుడు వచ్చిన నష్టాలో ఫుల్‌ఫిల్ చేస్తామన్నారు.
ఇక ఈ విషయంపై ఇటు అభిమానులు, నెటిజన్లు స్పందించారు. ఆయన నిజాయితీగా మాట్లాడినందుకు అభినందనలు తెలిపారు. ఈ రోజుల్లో ఏ నిర్మాత కూడా తమ వైఫల్యాలను అంగీకరించి.. పబ్లిక్‌గా ఇలా ఒప్పుకోవడం లేదని.. అందుకు అనిల్ సుంకర (Anil Sunkara)కు హ్యాట్యాఫ్ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పులు మల్లీ చేయొద్దని.. రాబోయే ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. త్వరలోనే కమర్షియల్ బ్లాక్ బస్టర్‌తో మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నామని కొందరు ట్వీట్ చేశారు.