అఖిల్ ఏజంట్(agent) తో మరో ఫెయిల్యూర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కెరీర్ పై ఎలా ముందుకు వెళ్తాడో తెలియాల్సి ఉంది. ఇక ఏజంట్ సినిమా అసలు అఖిల్ చేయాల్సింది కాదట. రామ్ చరణ్(Ram charan) కోసం తయారు చేసిన కథ అఖిల్ దగ్గరకు ఎలా వెళ్లింది..?
అఖిల్ ఏజంట్(agent) తో మరో ఫెయిల్యూర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కెరీర్ పై ఎలా ముందుకు వెళ్తాడో తెలియాల్సి ఉంది. ఇక ఏజంట్ సినిమా అసలు అఖిల్ చేయాల్సింది కాదట. రామ్ చరణ్(Ram charan) కోసం తయారు చేసిన కథ అఖిల్ దగ్గరకు ఎలా వెళ్లింది..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా మరో హీరోకు వెళ్లడం సాధారణంగా జరిగే ప్రక్కియే. స్టార్ హీరోలు వదులుకున్న కథలు చిన్న హీరోలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతే కాదు ఆ కథలతో హిట్టు కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాని స్టార్ హీరోలు ముందుగానే ఊహించి ఈ మూవీ వర్కౌట్ కాదు అనుకున్ని వదిలేసిన కథలు.. ఆహీరో అంచనాలు అందుకున్న సందర్భాలుక కూడా లేకపోలేదు. తాజాగా అఖిల్ ఏజెంట్ విషయంలో అదే జరిగింది.
ఒక హీరో వదులుకున్న కథ .. మరో హీరో దగ్గరికి వెళడం.. ఒక హీరోకి నచ్చని కథ .. మరో హీరోకి నచ్చడం అనే కాన్సెప్ట్ అఖిల్ ఏజెంట్ విషయంలో జరిగింది. ఇప్పుడు అఖిల్ కి ఫ్లాప్ ఇచ్చిన 'ఏజెంట్' కథ ముందుగా రామ్ చరణ్ వినడం జరిగిందట. ప్రస్తుతం ఈ టాక్ ఇండస్ట్రీలో తెరపైకి వచ్చింది. సురేందర్ రెడ్డికి ..రామ్ చరణ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ కాంబినేషన్ లో గతంతో 'ధ్రువ'(druva) సినిమా వచ్చింది. ఆసినిమా అంతలా హిట్ అవ్వకపోయినా.. చరణ్ కు మంచి ఇమేజ్ అయితే వచ్చింది.
అంతే కాదు దృవ టేకింగ్ తో పాటు డేరెక్షన్ కూడా నచ్చడంతో.. .. 'సైరా'(syra) చేయడానికి అవకాశం కూడా ఇచ్చాడు. ఇక చరణ్ తో ఉన్న ఆ స్నేహం కారణంగానే సురేందర్ రెడ్డి 'ఏజెంట్'(agent) సినిమాను చేయాలనుకున్నాడట. అంతే కాదు చరణ్ దగ్గర టైమ్ తీసుకుని కథ కూడా వినిపించాడట. అయితే ఆ సమయంలో చరణ్ ఇటు 'ఆర్ ఆర్ ఆర్'(RRR) .. అటు 'ఆచార్య(Acharya) సినిమాలతో బిజీగా ఉండటం, అప్పటికే శంకర్(shankar) సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన కుదరదని చెప్పాడట.
అందులోను ఇంత భారీ యాక్షన్ మూవీ చేయడం కూడా ఇష్టం లేకపోవడంతో.. చరణ్ ఈకథను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అందువల్లనే ఆ కథను పట్టుకుని అఖిల్ దగ్గరికి సురేందర్ రెడ్డి(surendhar reddy) వెళ్లాడని చెబుతున్నారు. సురేందర్ రెడ్డిపై గల నమ్మకంతో నాగ్ ఓకే చెప్పారు.కాని రెండేళ్లకు పైగా పడిన కష్టం. అఖిల్ సిక్స్ ప్యాక్.. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వారు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది పాపం.