అనుకున్నది ఒకటి .. అయ్యింది మరొక్కటి... పాపం అఖిల్ ఏజెంట్(agent) సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని కలలు కన్నాడు. కాని అవి కుప్పకూలిపోవడంతో.. ఒక్కసారిగా నిరాశ ఆవహించింది అక్కినేని హీరోను.

అనుకున్నది ఒకటి .. అయ్యింది మరొక్కటి... పాపం అఖిల్ ఏజెంట్(agent) సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని కలలు కన్నాడు. కాని అవి కుప్పకూలిపోవడంతో.. ఒక్కసారిగా నిరాశ ఆవహించింది అక్కినేని హీరోను.

అఖిల్ కు బిగ్ షాక్ తగిలింది. ఏజంట్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. అఖిల్(Akhil) కు అంతా శూన్యం అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సాలిడ్ హిట్ లేక... తనను తాను నిరూపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు అఖిల్. ఏదీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో.. ఈసారి పక్కా మాస్ హీరోగా మారిపోయి.. రెండేళ్లు సిక్స్ ఫ్యాక్ ను అలాగే మెయింటేన్ చేశాడు. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో సురేందర్ రెడ్డి(surendher reddy) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా ప్లాప్ అవ్వడంతో టీమ్ అంతా నిరాశలో మునిగిపోయారు.

ఏజంట్(agent) ప్లాప్ తో అఖిల్ డల్ అయిపోయాడు. డిప్రషన్ కూడా మెయింటేన్ చేస్తున్నట్టు టాక్. ఇక రిలాక్స్ అవ్వడం కోసం అక్కినేని హీరో దుబాయ్(dubai) వెళ్లినట్టు తెలుస్తోంది. మరి అక్కడ ఎన్ని రోజలు ఉంటాడు అనేది తెలియదు కాని.. మూవీ టీమ్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మమ్ముట్టి లాంటి స్టార్స్... భారీ వెపన్స్.. యాక్షన్ సీక్వెన్స్ లు.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అఖిల్ కు సక్సెస్ ఇవ్వలేకపోయారు.

ముఖ్యంగాఅఖిల్ లవర్ బాయ్ లా నీట్ గా.. ఉండేవాడు.. ఏజంట్ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో.. ఆర్నాల్డ్ మాదిరి బాడీని విల్డ్ చేసుకున్నాడు. కండలు తిరిగిన బాడీకోసం జిమ్ములో ఎక్కువ సేపు గడిపేవాడు. షూంటిగ్ జరిగిన రెండున్నరేళ్లు బాడీనిఅలా మెయింటేన్ చేయడం అంటే అంత సులువైన పని కాదు అది. కానీ తన కెరీర్ కోసం అఖిల్ చాలా చేశాడు. ఈసారి తనను తాను నిరూపించుకుంటే.. నెక్ట్స్ నుంచి కాస్త జాగ్రత్తగా అడుగులు వేయవచ్చు అని అనుకున్నాడు. కాని ఏజెంట్ ఇంత పెద్ద దెబ్బ కొడుతందని అస్సలు ఊహించలేదు.

అటు ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర నేరుగా ఫెయిల్యూర్ ని ఒప్పుకున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీ చేశాము. దానికి తోడు కొన్ని ప్రతికూల పరిస్థితులు. మొత్తంగా డిజాస్టర్ వచ్చింది. ఏజెంట్ పరాజయానికి బాధ్యత వహిస్తున్నామని ట్వీట్ చేశాడు. విమర్శల దాడి ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ.

Updated On 4 May 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story