జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం మేకర్స్‌ క్యూలు కడుతున్నారు. దర్శకులు కూడా స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు. ఆయన ఓకే చెబితే చాలని, ఎంతకాలమైన ఎదురుచూస్తామని కొందరు చెబుతున్నారు. పుష్ప 2(Pushpa 2) తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఏమై ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) క్రేజ్‌ ఇప్పుడు మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం మేకర్స్‌ క్యూలు కడుతున్నారు. దర్శకులు కూడా స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు. ఆయన ఓకే చెబితే చాలని, ఎంతకాలమైన ఎదురుచూస్తామని కొందరు చెబుతున్నారు. పుష్ప 2(Pushpa 2) తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఏమై ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అట్లీ(Atlee) దర్శకత్వంలో నటించడానికి బన్నీ అంగీకరించారని ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తున్న మాట! విజయ్‌తో తెరి, మెర్సల్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన అట్లీ తాజాగా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) హీరోగా జవాన్‌(Jawan) తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ సినిమా దూసుకుపోతున్నది. జవాన్ సినిమా ఏప్రిల్‌లోనే పూర్తయ్యిందని, తాను ఊహించిన దాని కంటే గొప్పగా వచ్చిందని అట్లీ అన్నారు. షారూక్‌ కూడా చాలా ఆనందంగా ఉన్నారని, ఎమోషన్‌ను కీలకంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎమోషన్‌కు మంచి ప్రాధాన్యత ఇస్తారని, ఈ సినిమా ఇక్కడ తప్పక అన్నివర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం తనకుందని అట్లీ పేర్కొన్నారు. దేవుడిపై భారం వేసి ప్రేక్షకులనే నమ్ముకుని బరిలోకి దిగామని, అందువల్లే షారుక్‌తోపాటు చిత్రం బృందం తిరుమలకు కూడా వెళ్లొచ్చిందని అన్నారు. తదుపరి అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కిస్తారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. బన్నీకి కథ చెప్పా. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మంచి విషయం చెబుతానని అట్లీ అన్నారు.

Updated On 7 Sep 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story