దిగ్దర్శకుడు శంకర్‌(Shankar) వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌(Adithi Shankar) మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నారు. నటనపై ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి మరీ హీరోయిన్‌గా పరిచయం అయిన అదితి శంకర్‌ ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తున్నారు. ఈ మధ్య ఆమె తరచూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. కార్తీ(Karthi) హీరోగా వచ్చిన విరుమాన్‌(Viruman) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన అదితి శంకర్‌ తర్వాత మావీరన్‌ సినిమాలో శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan) సరసన నటించారు.

దిగ్దర్శకుడు శంకర్‌(Shankar) వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌(Adithi Shankar) మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నారు. నటనపై ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి మరీ హీరోయిన్‌గా పరిచయం అయిన అదితి శంకర్‌ ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తున్నారు. ఈ మధ్య ఆమె తరచూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. కార్తీ(Karthi) హీరోగా వచ్చిన విరుమాన్‌(Viruman) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన అదితి శంకర్‌ తర్వాత మావీరన్‌ సినిమాలో శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan) సరసన నటించారు. ఈ రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ఆకాశ్‌ మురళికి జంటగా నటిస్తున్నారు అదితి.

లేటెస్ట్‌గా విష్ణు విశాల్‌(Vishnu Vishal) హీరోగా వస్తున్న సినిమాను కూడా ఒప్పుకున్నారట! తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్యతో కలిసి నటించబోతున్నారని సమాచారం. ఇలా అదితి శంకర్‌ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఆమె తర్వాతి లక్ష్యం దళపతి విజయ్‌తో(Vijay Thalapathy) కలిసి నటించడమే కావొచ్చు. తాజాగా రోల్స్‌ రాయిస్‌ కారులో వెళుతూ విజయ్‌ తాజా చిత్రం లియోలోని నా వరువా పాటకు డాన్స్‌ చేస్తూ రచ్చ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అదితి శంకర్‌ తదుపరి టార్గెట్‌ హీరో విజయేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది మరీ ఓవర్‌గా లేదూ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతేనేమీ అదితి శంకర్‌కు మాత్రం ఉత్తినే పబ్లిసిటీ దొరికేస్తోంది.

Updated On 6 Sep 2023 3:34 AM GMT
Ehatv

Ehatv

Next Story