యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Rebal Star Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ(Pan India Movie) ఆదిపురుష్(Adipurush).. రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా కనిపించనున్నారు. కృతి సనన్ సీతమ్మ పాత్రను పోషిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) వేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతున్నది.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Rebal Star Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ(Pan India Movie) ఆదిపురుష్(Adipurush).. రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా కనిపించనున్నారు. కృతి సనన్ సీతమ్మ పాత్రను పోషిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) వేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతున్నది. మొన్న శ్రీరామనవమి(Rama Navami)పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిపురుష్ సినిమా కొత్త పోస్టర్(New Poster)ను విడుదల చేశారు మేకర్స్.. ఇక ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. రామభక్తుడు, రాముడి ఆత్మ, జైపవన్‌పుత్ర హనుమాన్ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆంజనేయస్వామిగా దేవదత్ నాగే నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాలి.. కాకపోతే టీజర్‌పై వచ్చిన విమర్శలు చూసి మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గ్రాఫిక్స్ వర్క్స్ చాలా ఉండటంతో సినిమాను జూన్ 16కు వాయిదా వేశారు. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పట్నుంచి వివాదాలు మొదలయ్యాయి. టీజర్ చూసి చాలా మంది పెదవి విరిచారు. ఇదేదో కార్టున్ సినిమాలా ఉందని కొందరు విమర్శించారు కూడా. రామాయణం పాత్రలలోని వేషధారణలను పూర్తిగా మార్చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.
రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై వ్యతిరేకత వచ్చింది. అసలు ఇది రామాయణమేనా అన్న సందేహాలు కూడా వచ్చాయి. దాంతో గ్రాఫిక్స్ వర్క్స్‌పై శ్రద్ధ పెట్టారు మేకర్స్. మొన్న రామనవమికి విడుదల చేసిన పోస్టర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్ పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు పోలీసులకు కంప్లయింట్ కూడా చేశారు. రామాయణాన్ని చెడగొడుతున్నారని, సహజ స్ఫూర్తికి, స్వభావానికి భిన్నంగా రాముడిని చూపించారని ముంబాయికి చెందిన సంజయ్ దీనానాథ్ తివారీ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగిన జానేవు అనే పవిత్ర దారాన్ని రాముడు కానీ, లక్ష్మణుడు కానీ ధరించలేదని తిట్టిపోశారు. ఇప్పటికే బోల్డన్నీ వివాదాలను మూటగట్టుకున్న ఆదిపురుష్ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలకు కేంద్రబిందువు అవుతుందో చూడాలి.