ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటిస్తున్న 'ఆదిపురుష్' (Adipurush) సీతానవమి సందర్భంగా.. మూవీ టీమ్ ప్రభాస్ శ్రీరాముడి అవతరాంలో ఉన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 'రామ్ సియారామ్' (Ram Siya Ram) అంటూ పాటతో సాగే మోషన్ పోస్టర్‏తోపాటు ఓ పోస్టర్‏ను విడుదల చేశారు.

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటిస్తున్న 'ఆదిపురుష్' (Adipurush) సీతానవమి సందర్భంగా.. మూవీ టీమ్ ప్రభాస్ శ్రీరాముడి అవతరాంలో ఉన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 'రామ్ సియారామ్' (Ram Siya Ram) అంటూ పాటతో సాగే మోషన్ పోస్టర్‏తోపాటు ఓ పోస్టర్‏ను విడుదల చేశారు. కృతి సనన్ లుక్‏కు ఆడియన్స్ మంత్రముగ్ధులతువున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కృతిసనన్ తన ఇన్‏స్టా గ్రామ్‏ (Instagram)లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో కృతిసనన్ జానకిగా, ప్రభాస్ ఇంటెన్సీవ్‏గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ ఇంత బ్యూటిఫుల్‏గా ఉంది.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సూపర్బ్ అంటూ ఒ నెటిజన్ కమెంట్ చేశారు. ఇక మరొకరైతే 'నువ్వు చాలా బావున్నావు' కృతి అంటూ మెసెజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ మరో అభిమాని 'ఆల్ ది బెస్ట్ కృతి.. నేను 100 శాతం నమ్ముతున్నాను.. ఈ విజయం కూడా మీదే అంటూ కంగ్రాట్స్ తెలిపాడు.

ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ప్రభాస్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కృతి సనన్, దేవదత్త నాగే వంటి వారు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఫస్ట్ ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. సీజీఐ అండ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్‏లోపాలు ఉండటంతో మూవీ రిలీజ్ డేట్‏ను మార్చారు. అయితే ఈ సినిమా 2023 జూన్ 16న థియేటర్లలోకి రానుంది.

ఇదిలా ఉంటే కృతీ సనన్ ఇటీవల కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన 'షెహజాదా' సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆదిపురుష్ మినహా ఈ భామకు వరుస సినిమాలు చేస్తోంది. టైగర్ ష్ట్రాఫ్ (Tiger Shroff)‏తో కలిసి గణపథ్ అనే చిత్రంలో నటించింది. ఇక ఈ భామ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), టబు (Tabu)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

Updated On 29 April 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story