ఆదిపురుష్‌(adipurush)...ఈ మధ్యకాలంలో ఈ సినిమాపై వచ్చినన్ని విమర్శలు, చుట్టుకున్న వివాదాలు మరో చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు.. సినిమా టీజర్‌(teaser) విడుదలైనప్పుడు మొదలైన విమర్శలు సినిమా వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఆదిపురుష్‌ మూడు రోజుల తర్వాత చాపచుట్టేసింది.

ఆదిపురుష్‌(adipurush)...ఈ మధ్యకాలంలో ఈ సినిమాపై వచ్చినన్ని విమర్శలు, చుట్టుకున్న వివాదాలు మరో చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు.. సినిమా టీజర్‌(teaser) విడుదలైనప్పుడు మొదలైన విమర్శలు సినిమా వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఆదిపురుష్‌ మూడు రోజుల తర్వాత చాపచుట్టేసింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డులు సృష్టించిన ఆదిపురుష్‌ తర్వాత మరో వంద కోట్లను రాబట్టేందుకు వారం రోజులు పట్టాల్సి వచ్చింది.

ఇప్పుడు సినిమాకు కలెక్షన్లే లేవు. థియేటర్‌(theaters) దగ్గరకు ప్రేక్షకులు రావడం లేదు. ఎలాగైనా సరే ప్రేక్షకులను మళ్లీ థియేటర్‌ దగ్గరకు రాబట్టడానికి చిత్ర యూనిట్‌(Movie Unit) గొప్ప ప్లాన్‌ వేసింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట జూన్‌ 21న ఆదిపురుష్‌ త్రీడీ టికెట్‌ రేట్లను 150 రూపాయలకే అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు మేకర్స్‌. అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ సదుపాయం ఉంటుందని తెలిపారు. కాని వారి పాచిక పారలేదు. ఆదిపురుష్‌ చూసేందుకు జనం రావడం మానేశారు. దీంతో తాజాగా మరోసారి టికెట్‌ రేట్లు తగ్గించారు. కేవలం 112 రూపాయలకే ఆదిపురుష్‌ త్రీడీ టికెట్లు(3D ticket) బుక్‌ చేసుకోండి అని ప్రకటించారు.

సోమవారం నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ బంపరాఫర్‌పై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా చూడమని ఒకరు, మీరు టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడే సినిమాను ఎంత దరిద్రంగా తీశారో అర్థమయ్యిందని మరొకరు, సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకునేదాని కంటే ఇంట్లో ఉండటమే నయం అని ఇంకొకరు కామెంట్‌ చేశారు. అరె.. నాయనా.. రూపాయికి టికెట్‌ ఇచ్చినా మేము చూడం. ఓం రౌత్‌ ఆంజనేయుడి కోసం థియేటర్‌లో ఒక సీటు వదిలేయమన్నాడు కాబట్టి మనమంతా వాననసేన కోసం సినిమాహాల్‌ అంతా వదిలేద్దామని సెటైర్లు వేస్తున్నారు.

Updated On 26 Jun 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story