ప్రభాస్(Prabhas) అభిమానులే కాదు, సినిమా ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రామాయణం(Ramayanam) ఇతివృత్తం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. సీతగా కృతి సనన్(Kriti sanon) నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(saif Ali khan) కనిపించబోతున్నారు.
ప్రభాస్(Prabhas) అభిమానులే కాదు, సినిమా ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రామాయణం(Ramayanam) ఇతివృత్తం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. సీతగా కృతి సనన్(Kriti sanon) నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(saif Ali khan) కనిపించబోతున్నారు. ఇప్పటికే కొందరు సినిమా ప్రముఖులు భారీ ఎత్తున టికెట్లు కొనేసి సినిమాపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో ప్రతీ రామాలయానికి ఉచితంగా 101 టికెట్లను ఇవ్వనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును ఆంజనేయుడి(Hanuma) కోసం ఖాళీగా ఉంచాలని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్ రేటుకు సంబంధించిన వదంతులు మొదలయ్యాయి.
రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ ఆంజనేయస్వామి వస్తాడు అనే నమ్మకం అనాదిగా ఉంది. ఆ విశ్వాసంతోనే ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో కొందరు ఆ సీటు పక్క టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఆదిపురుష్(Adhipurush) నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అదంతా తప్పుడు కథనమని, అవాస్తవాలను నమ్మవద్దని విన్నవించుకుంటూ ట్వీట్ చేసింది. 'ఆదిపురుష్ టికెట్ల విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. హనుమంతిని పక్క సీటు టికెట్‌ను భారీ రేటుకు అమ్ముతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్‌ను కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి వదంతులను సృష్టించకండి.. వైరల్ చేయకండి' అంటూ ట్వీట్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..