ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఆదిపురుష్(adipurush) సినిమాపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా మొదలుపెట్టినప్పుడు ఆ చిత్రానికి బోల్డంత హైప్ వచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది తిట్టుకున్నారు. ఏమిటీ వెధవ వేషాలంటూ ఈసడించుకున్నారు. సినిమా వచ్చినతర్వాత వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఆదిపురుష్(adipurush) సినిమాపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా మొదలుపెట్టినప్పుడు ఆ చిత్రానికి బోల్డంత హైప్ వచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది తిట్టుకున్నారు. ఏమిటీ వెధవ వేషాలంటూ ఈసడించుకున్నారు. సినిమా వచ్చినతర్వాత వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్(Kriti sanon) సీతగా, సైఫ్ ఆలీఖాన్(saif ali Khan) రావణుడుగా నటించిన ఈ సినిమా రామాయణం(Ramayanam) ఆధారంగా నిర్మించారు.
రామాయణాన్ని భ్రష్టు పట్టించారన్నది ప్రేక్షకుల నుంచి వస్తున్న మాట. కొన్ని ప్రాంతాలలో అయితే సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సినిమా ప్రదర్శనను నిలిపివేశారు కూడా! రామాయణాన్ని వక్రీకరించారని, కేవలం వీఎఫ్‌ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాలను తలపించిందని, రావణబ్రహ్మ వేషధారణ సరిగా లేదని కోట్లాది మంది అంటున్నారు. ఇన్నేసి వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా మాటల రచయత, పాటల రచయత మనోజ్ ముంతాషిర్ శుక్లా(Manoj Munthashir Shukla) మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు హనుమంతుడు(Haniman) దేవుడు కాని, ఆయనో భక్తుడని మనోజ్ ముంతాషిర్ శుక్లా ఓ చెత్త వాగుడు వాగాడు.
తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటన్నాడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సవాలక్ష వివాదాలతో సతమతమవుతున్న ఆదిపురుష్ సినిమాకు ఈ మాటలు మరింత ప్రతికూలంగా మారే ఛాన్సుంది. ఈ ప్రభావం కలెక్షన్లపై కూడా పడొచ్చు. శుక్లా మాటలు సోషల్ మీడియాలో విన్న నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి మనోజ్ ముంతాషిర్ శుక్లా అనే వ్యక్తి రామాయణాన్ని చదవలేదని అర్థమవుతోంది. హనుమంతుడి వృత్తాంతాన్ని చదవలేదని తెలుస్తోంది.