ఈ మధ్య కాలంలో ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఎదుర్కొన్నన్ని వివాదాలు మరే చిత్రానికి ఎదురుకాలేదు. సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా విడుదలైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను తిట్టిపోస్తున్నారు. సీనియర్‌ నటులు, దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రామాయణగాధను ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించడంపై ఘాటైన విమర్శలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఎదుర్కొన్నన్ని వివాదాలు మరే చిత్రానికి ఎదురుకాలేదు. సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా విడుదలైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను తిట్టిపోస్తున్నారు. సీనియర్‌ నటులు, దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రామాయణగాధను ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించడంపై ఘాటైన విమర్శలు వస్తున్నాయి. రాముడిగా నటించిన ప్రభాస్‌(prabhas), సీతగా నటించిన కృతి సనన్‌(Kriti sanon), రావణుడిగా నటించిన సైఫ్‌ ఆలీఖాన్‌ల(Saif Ali Khan) వేషధారణలపై కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనోజు ముంతాషిర్‌ శుక్లా(Manoj muntthashir shukla) నాసిరకం డైలాగులు రాశాడని తిడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లంకా దహనం సందర్భంలో హనుమాన్‌ పాత్రధారి చెప్పిన డైలాగ్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ సంభాషణలను మార్చారు. కొత్తడైలాగ్స్‌తో సినిమాను ప్రదర్శిస్తున్నట్లుగా చిత్రబృందం తెలియజేసింది.ఈ చిత్రానికి ఓంరౌత్‌ దర్శకత్వం వహించారు. అయితే తాము పొరపాటు చేశామని క్షమాపణలు మాత్రం చిత్ర యూనిట్‌ చెప్పడం లేదు..

Updated On 22 Jun 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story