✕
Adipurush 3d in Tribeca : కాంట్రవర్సీలు దాటి...ప్రపంచవేదికపైకి ఆదిపురుష్.. !
By EhatvPublished on 19 April 2023 7:54 AM GMT
ఇండియన్ బాహుబలి ప్రభాస్ రాముడిగా టీ సిరీస్ ఓం రౌత్ దర్వకత్వంలో నిర్మించిన భారీ ఎత్తు చిత్రం ఆదిపురుష్ దాదాపుగా భారతదేశంలో ఎన్ని రకాల కాంట్రవర్సీలను, ఎన్ని రకాల ఆరోపణలను ఎదుర్కొందో మాటల్లో చెప్పడానికి వీలు లేదు. ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాలలోనూ అన్ని న్యాయస్థానాలలోనూ ఆదిపురుష్ చిత్రం మీద కోర్టు కేసులు నడిచాయి. వాటన్నిటినీ కూడా చిత్ర యూనిట్ ఎంతో సంయమనంతో ఫేస్ చేసి, తమ వైపు నుంచి ఏ కోణంలోనూ తాము నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక దృశ్యకావ్యానికి అప్రతిష్ట కలుగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వీటన్నిటినీ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేసినవారు కూడా లేకపోలేదు. ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ తతంగమంతా జరిగిందని అన్నవాళ్ళు కూడా కోకొల్లలు.

x
Adipurush 3D
-
- ఇండియన్ బాహుబలి ప్రభాస్ రాముడిగా టీ సిరీస్ ఓం రౌత్ దర్వకత్వంలో నిర్మించిన భారీ ఎత్తు చిత్రం ఆదిపురుష్ దాదాపుగా భారతదేశంలో ఎన్ని రకాల కాంట్రవర్సీలను, ఎన్ని రకాల ఆరోపణలను ఎదుర్కొందో మాటల్లో చెప్పడానికి వీలు లేదు. ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాలలోనూ అన్ని న్యాయస్థానాలలోనూ ఆదిపురుష్ చిత్రం మీద కోర్టు కేసులు నడిచాయి. వాటన్నిటినీ కూడా చిత్ర యూనిట్ ఎంతో సంయమనంతో ఫేస్ చేసి, తమ వైపు నుంచి ఏ కోణంలోనూ తాము నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక దృశ్యకావ్యానికి అప్రతిష్ట కలుగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వీటన్నిటినీ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేసినవారు కూడా లేకపోలేదు. ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ తతంగమంతా జరిగిందని అన్నవాళ్ళు కూడా కోకొల్లలు.
-
- మొత్తానికి జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదల కాబోతున్నదని వార్త వచ్చిన తర్వాత కూడా ఆదిపురుష్ చిత్రం తట్లుకోలేనంత ఇబ్బందిని ఫేస్ చేసింది. రామాయణం ఒక కావ్యంగా రాముడిపాత్ర ద్వారా ఎలాటి విమర్శలను యుగయుగాలుగా స్వీకరించిందో, ఆదిపురుష్ చిత్రం కూడా అలాటి విమర్శలనే మూట కట్టుకుంది. కానీ, ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ఆదిపురుష్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ప్రభాస్ అసంఖ్యాక అభిమానులకు గొప్ప ఊరటను కలిగిస్తే, ఆదిపురుష్ యూనిట్ తలెత్తుకునేలా చేసింది. అదే ట్రిబెకా వేదికపైన ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 13న ప్రదర్శిస్తున్నట్టుగా ట్రిబెకా టీం ఎప్పుడైతే ప్రకటించిందో ఆదిపురుష్ ఒక్కసారిగా మల్ళీ హెడ్లైన్స్లోకి జోరుగా, ఆలవోకగా చేరుకుంది.
-
- జాతీయ అవార్డులను గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్వకత్వంలో, మన బాహుబలి ప్రభాస్ రాముడిగా రూపొందిన ఆదిపురుష్ చిత్రయూనిట్ యావత్తూ మన భారతీయ సంస్కృతీ వైభవం ప్రపంచవేదికపైన జెండా ఎగురవేయబోతున్నందుకు ఎగిరి గెంతులు వేస్తోంది. ఇది ఒక రకంగా భారతీయ ప్రతిష్టకూ, సినీ వైభవానికే కాదు, మన దేశ సంస్కృతీ ఔన్నత్యానికి సైతం ఆగ్రతాంబూలం అందినట్టే. ప్రతీయేటా న్యూయార్క్ సిటీలో జూన్ 7 నుంచి 18 వరకూ జరిగే ట్రిబెకా ఉత్సవాలలో జూన్ 13న ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్ జరుగబోతోంది ఒహో అని చిత్రయూనిట్ ప్రకటించుకుని ఆనందంలో తలమనుకలవుతోంది. అది కూడా సరింగా ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న జస్ట్ మూడు రోజుల ముందే ఇటువంటి ప్రపంచస్థాయి వేదికపైన వరల్డ్ ప్రీమియర్ జరగడమన్నది నిజంగానే ఒక అద్భుతమైన పరిణామం.
-
- ఇంత వరకూ కాంట్రవర్సీలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్న ఆదిపురుష్ చిత్రం, ఆ చిత్రయూనిట్‌కి ఇంతకన్నా అపూర్వమైన అనుభవం మరొకటి లేదు,రాదు.2001లో సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఉగ్రవాదులు జరిపిన భయానకమైన దాడికి స్మారక సంఘటనగా రాబర్డ్ డీ నీరో వంటి హాలీవుడ్ మహానటుడు శ్రీకారం చుట్టిన ఈ ట్రిబెకా ఉత్సవం ప్రపంచం నలుమూలలా ఉన్న సినీ ప్రతిభను, క్రియేటివ్ జీనియస్‌ను, అవార్డులు గెలుచుకున్న కళాఖండాలను ప్రదర్శించడం ద్వారా ప్రపంచసమాజానికి ప్రత్యేకమైన ప్రీమియర్స్‌తో, ఎగ్జిబిషన్స్‌తో, చర్చలతో, లైవ్ పెరఫారమెన్స్లతో వినూత్నమైన, విలక్షణమైన గొంతులను, ఆలోచనలను ప్రపంచ కళాప్రియులకు అందజేస్తుంది.
-
- ఈ క్రమంలో జరుగుబోతున్న 22వ ఉత్సవాలలో ఆదిపురుష్‌కి పెద్దపీటను వేశారు. ఈ వార్త దాదాపుగా ఇండియానే ఉరకలు వేయించింది. ఇంక ఆదిపురుష్ దర్శకనిర్మాతలైన ఓం రౌత్, భూషణ్ కుమార్, రాముడు పాత్ర ధరించిన ప్రభాస్‌ల సంతోషానికి అంతే లేదు. నా జన్మ ధన్యమైంది- ప్రభాస్ ఈ సందర్భంగా స్పందిస్తూ తన జీవితంలో ఇంతకన్నా గొప్ప సంఘటన మరొకటి ఉండబోదని మీడియా ద్వారా ప్రకటించాడు. రాముడి పాత్రను ధరించడానికి అవకాశం రావడమే ఓ మహా అనుభవమైతే, ఆదిపురుష్ చిత్రం ఇటువంటి ఓ సంచలన వేదికపైన త్రిడిలో ప్రదర్శనకు నోచుకోవడం తన పూర్వజన్మసుకృతమని పొంగిపోయాడు.
-
- ఆదిపురుష్ మన పురాణాల ఔన్నత్యాన్ని, అందులోని ఘనతను ఈ సందర్భంగా ప్రపంచమానవాళికి బాహాటంగా, బిగ్గరగా చాటి చెప్పడానికి ఇంత కన్నా గొప్ప వేదిక, అవకాశం ఇంక రానేరాదని ప్రబాస్ తన్మయత్వంలో తడిసి ముద్దైపోయాడు. ఒక నటుడిగానే కాదు, ఒక భారతీయ పౌరుడిగా కూడా నాకిది ఎనలేని గౌరవాన్ని, గర్వాన్ని ఇచ్చిందని ప్రభాస్ తన పత్రికా ప్రకటనలో అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంక ఓం రౌత్, భూషణ్ కుమార్ల ఆనందం సరేసరి. పట్టపగ్గాలే లేవు. వాళ్ళ ఆనందం నిజమే...సార్ధకమే! Wrtten by : నాగేంద్రకుమార్

Ehatv
Next Story