డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయ్యాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాగోలేదన్న టాక్ వినిపించింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే ఉన్నా, తర్వాతర్వాత తగ్గడం మొదలయ్యాయి.
డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయ్యాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాగోలేదన్న టాక్ వినిపించింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే ఉన్నా, తర్వాతర్వాత తగ్గడం మొదలయ్యాయి. మొదటివారంతో పోలిస్ఏ, రెండో వారం కలెక్షన్స్ పూర్తిగా తగ్గాయి. ప్రస్తుతం వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ఇప్పటి వరకు భారత్‌లో ఆదిపురుష్ 300 కోట్ల రూపాయల మార్కును దాటిందని అంటున్నారు. ఓవర్సీస్ లెక్కలు తెలియాల్సి ఉంది. మరోవైపు రోజు రోజుకీ తగ్గుతున్న కలెక్షన్స్ చూస్తుంటే, థియేటర్ల నుంచి సినిమా తప్పుకునే రోజు వచ్చిందని అర్థమవుతోంది. గత వారం విడుదలైన కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. జులై మొదటి వారంలో మరిన్ని చిత్రాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో వారంపాటు ఆదిపురుష్ థియేటర్‌లో కొనసాగడం కష్టమే. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదలపై చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. జులై 15,16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆదిపురుష్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఓ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ జులై 16న ఆదిపురుష్ స్ట్రీమింగ్‌కు వస్తే సరిగ్గా నెల రోజులకు ఓటీటీకి వచ్చినట్టు అవుతుంది.
ఆదిపురుష్ సినిమాను టి.సిరీస్ ఫిల్మ్స్ పతాకంపై భూషణ్‌కుమార్, కృషన్‌కుమార్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా చిత్ర బృందం విడుదల చేస్తూ వస్తోంది.