ఇక ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జీఎస్టీతో కలిసి 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ట్రైలరే కాదు, పాటలు కూడా ఈ చిత్రంపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే పాట సినిమాపై ఆసక్తిని పెంచింది.
ప్రభాస్(prabhas) శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్(adhipurush) విడుదల తేదీ దగ్గరకొచ్చేసింది. మహా అయితే మరో పదిహేను రోజులే ఉంది. రామాయణ(ramayanam) గాథను ఇప్పటి తరం ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. తన్హాజీ ఫేం ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లాస్టియర్ చివరలో విడుదలైన టీజర్ చూసి చాలా మంది విమర్శించారు. కొందరైతే ఘాటుగా తిట్టిపోశారు. దాంతో చిత్ర యూనిట్ ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. వీఎఫ్‌ఎక్స్‌లో క్వాలిటీ పెంచింది. అందుకే ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఒక్క ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సినిమా ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్లతో బిజీ అయ్యింది. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 6వ తేదీన తిరుపతిలో భారీ ఎత్తున జరపబోతున్నారు.
ఇక ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ జరుగుని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చేలా బాణసంచాను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. క్రాకర్స్ కోసమే 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారట. అంతేనా.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబాయి నుంచి 200 మంది డ్యాన్సర్లు, 200 మంది సింగర్లు రానున్నారట. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రేంజ్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఇక ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జీఎస్టీతో కలిసి 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ట్రైలరే కాదు, పాటలు కూడా ఈ చిత్రంపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్(Kriti Sanon) నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్(Saif ALi Khan) పోషిస్తున్నారు. టీ-సిరీస్(T-Series), రెట్రో ఫైల్స్(Retro Files) సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాను దాదాపు పది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.