తమిళనాడులోని(Tamil Nadu) నామ్ తమిళర్ కట్చి పార్టీ(NTK Party) వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు, దర్శకుడు సీమాన్(Seeman) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు నటి విజయలక్ష్మి(Vijayalakshmi) ఆరోపించిన విషయం తెలిసిందే! ఇప్పుడామె తిరువళ్లూరు మహిళా కోర్టు(Women Court) న్యాయమూర్తి పవిత్ర(Judge Pavitra) ఎదుట హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని ఆధారాలను కూడా న్యాయమూర్తికి సమర్పించారు.

Vijayalakshmi
తమిళనాడులోని(Tamil Nadu) నామ్ తమిళర్ కట్చి పార్టీ(NTK Party) వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు, దర్శకుడు సీమాన్(Seeman) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు నటి విజయలక్ష్మి(Vijayalakshmi) ఆరోపించిన విషయం తెలిసిందే! ఇప్పుడామె తిరువళ్లూరు మహిళా కోర్టు(Women Court) న్యాయమూర్తి పవిత్ర(Judge Pavitra) ఎదుట హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని ఆధారాలను కూడా న్యాయమూర్తికి సమర్పించారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు విజయలక్ష్మి. హనుమాన్ జంక్షన్ సినిమాలో వేణు సరసన నటించిన విజయలక్ష్మి తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. 2007-2009 వరకు సీమన్‌తో సహజీవనం(living Together) చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లికి విముఖత చూపాడు సీమాన్. తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేసన్‌లో సీమాన్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లోనే ఉండటంతో పది రోజుల కిందట ఆందోళనబాట పట్టారు విజయలక్ష్మి. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు కంప్లయింట్ చేసినా సీమాన్‌ను అరెస్ట్ చేయలేదని విజయలక్ష్మి ఆరోపించారు. ఈ ఆరోపణలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయలక్ష్మిని వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్ ఉమయాల్, అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్, సీఐలు మహ్మద్‌బర్గతుల్లా, రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. సుమారు ఆరు గంటల పాటు విచారించారు. తర్వాత ఆమెను తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని నాయమూర్తి పవిత్ర రెండు గంటల పాటు విచారించారు.
గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలన్న న్యాయమూర్తి కోరిక మేరకు అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు విజయలక్ష్మి. తనకు సీమాన్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానంలోనే ఆమె కంటతడిపెట్టారు. విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి పవిత్ర ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత బందోబస్తు మధ్యన విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు.
