నార్త్... సౌత్ అని లేదు.. స్టార్ అని సామాన్యులనిలేదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు ప్రతీ ఒక్కరూ కాస్టింగ్ కౌచ్ బాధితులే. ఈమధ్య కొంత మంది లేపిన మీటూ ఉద్యమం వల్లే చాలా మంది స్టార్లు తాము కూడా బాధితులమరి చెప్పుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఎందో తమ తమ ఇంటర్వ్యూలలోతాము అనుభవించిన మానసిక క్షోబను బయట పెట్టారు. అంటే కాదు మగవారి కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారంటే..
నార్త్... సౌత్ అని లేదు.. స్టార్ అని సామాన్యులనిలేదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు ప్రతీ ఒక్కరూ కాస్టింగ్ కౌచ్ బాధితులే. ఈమధ్య కొంత మంది లేపిన మీటూ ఉద్యమం వల్లే చాలా మంది స్టార్లు తాము కూడా బాధితులమరి చెప్పుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఎందో తమ తమ ఇంటర్వ్యూలలోతాము అనుభవించిన మానసిక క్షోబను బయట పెట్టారు. అంటే కాదు మగవారి కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారంటే.. ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.
క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే.. చాలా మంది స్టార్ హీరోయిన్లు స్పందిచారు.. తమ ఆవేదన వెలిబుచ్చారు. అందుల బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా గతంలో కూడా వివరించింది. ఇక తాజాగా కాస్టింగ్ కౌచ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి. కెరీర్ బిగినింగ్ లో.. ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అలా అనుకున్నాడని.. కాని నేను జాగ్రత్త పడబట్టి బయట పడ్డాను అంటోంది బ్యూటీ.
విద్యా బాలన్ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. పైగా చాలా సార్లు తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. తన సినీ కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో ఓ ఫిల్మ్ కోసం డైరెక్టర్ ను కలవడానికి ఓ హోటల్ కి వెళ్లాను. డైరెక్టర్‌ను కలిశాక, ఆయన నన్ను గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని ఒత్తిడి తెచ్చాడు. అతడి ఆలోచన అర్థమయ్యి అతనిపై కోపంగా చూడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది.
అయితే అదృష్టవశాత్తు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో నేను చిక్కుకోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే.. ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉంటాయని చాలామంది నాకు కథలు కథలుగా చెప్పారు. అందుకే నేను కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే నన్ను నేను మలుచుకుంటూ వచ్చాను అని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది.