తమిళంలో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Tamil 7)దూసుకుపోతున్నది. లోకనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)హోస్ట్‌ చేస్తున్న ఈ షో నుంచి ఇప్పటికే బావ చెల్లదురై, ప్రదీప్‌ ఆంటోని, అననయ్య, విజయ్‌వర్మ, వినూష, యుకేంద్రన్‌, అన్న భారతి, ఐషు, కనబాలా తదితరులు ఎలిమినేట్‌ అయ్యారు.

తమిళంలో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Tamil 7)దూసుకుపోతున్నది. లోకనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)హోస్ట్‌ చేస్తున్న ఈ షో నుంచి ఇప్పటికే బావ చెల్లదురై, ప్రదీప్‌ ఆంటోని, అననయ్య, విజయ్‌వర్మ, వినూష, యుకేంద్రన్‌, అన్న భారతి, ఐషు, కనబాలా తదితరులు ఎలిమినేట్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ ఓటింగ్‌లో నటి అర్చన అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్‌ ప్లేస్‌లో సీనియర్‌ నటి విచిత్ర(Vichithra) ఉన్నారు. వీరిద్దరు టైటిల్‌ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. ఆట తీరుతో పాటు చక్కటి మైండ్‌ స్ట్రాటజీతో ముందుకు వెళుతున్న విచిత్రకు ఫ్యాన్స్‌ కూడా అమాంతం పెరిగారు. టాలీవుడ్‌లో ఓ ఫేమస్‌ హీరో కారణంగా తను దారుణమైన కాస్టింగ్‌ కౌచ్‌(Casting couch)కు గురయ్యానని, అతడి వల్లే తాను సినీ ఫీల్డ్‌ నుంచి తప్పుకున్నానని విచిత్ర తెలిపారు. అప్పటికే విచిత్ర ఓ 90 సినిమాల వరకు నటించారు. విచిత్ర చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. వారాంతంలో అంటే శని, ఆదివారాల ఎపిసోడ్‌లలో కమలహాసన్‌ విచిత్ర కామెంట్లపై చర్చిస్తారా? ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరు? అప్పుడు నడిగర్‌ సంఘంలో ఏం జరిగింది? విచిత్రకు సాయం చేయడానికి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదు? ఇవన్నీ విచిత్రతో చెప్పిస్తారా? లేదా? చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలివి! సోషల్‌ మీడియాలో అయితే వీటిపైనే పెద్ద చర్చ జరుగుతోంది. ‘ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయనడానికి విచిత్ర వెలిబుచ్చిన ఆవేదనే పెద్ద ఉదాహరణ. దీనిపై శని, ఆదివారాల్లో కమల్‌ హాసన్‌ ఏం చెప్పబోతున్నారో తెలుస్తుంది. నిజాయితీ గల వ్యక్తి, రాజకీయ నాయకుడు కమల్‌ అయితే విచిత్ర గురించి తప్పనిసరిగా మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎవరో ఆమెతో చెప్పించాలి..? అలాంటి వారిని సమాజానికి దూరంగా ఉంచాలి. అప్పట్లో కేసు కూడా పెట్టినట్లు విచిత్ర చెబుతుంది. దానిని మళ్లీ తెరపైకి తీసుకురావాలి.' అని ప్రముఖ జర్నలిస్టు బిస్మీ అన్నారు. మళ్లీ ఆయనే ఈ వివాదంపై కమల్ మాట్లాడక పోవచ్చని చెప్పారు. 'ఎందుకంటే విచిత్రపై కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడిన వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి అని విచిత్రనే చెప్పింది.. అలాంటప్పుడు అతనికి కూడా అభిమానులు ఉంటారు. అలాంటప్పుడు అతనికి వ్యతిరేకంగా కమలహాసన్ మాట్లడలేరు. ఒకవేళ ఆ అగ్ర హీరోకు వ్యతిరేకంగా కమల్ మాట్లాడితే టాలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఏమైనా ఇబ్బందులు రావచ్చు. దీంతో కమల్ కూడా ఈ విషయాన్ని విస్మరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి' అని బిస్మీ అన్నారు. ఈ శని, ఆదివారాల్లో ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ కోసం ఆ అగ్ర హీరో ఫ్యాన్స్‌తో పాటు బిగ్‌బాస్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ అగ్రహీరో పేరు విచిత్ర చెప్పకపోయినా అతడెవరో చాలా మందికి తెలిసిపోయింది. విచిత్ర తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశారు. అదే భలేవాడివి బాసు! పైగా ఈ సినిమా షూటింగ్‌ పాలక్కాడ్‌లో జరిగింది. సోషల్‌ మీడియాలో కొందరు ఆ హీరో పేరును ప్రస్తావిస్తూ తిట్టిపోస్తున్నారు. ఆ మధ్యన అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి అంటూ వల్గర్‌ కామెంట్లు చేసిన ఆ హీరోనే అయి ఉంటాడని నెటిజన్లు అంటున్నారు.

Updated On 23 Nov 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story